డ్రగ్స్ పార్శిల్ వచ్చిందంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే.. డబ్బులు పంపడంతో మైండ్ బ్లాంక్.!
ఆ మహిళ వయస్సు 40 ఏళ్లు. కొద్దిరోజుల కిందట ఆమె భర్త మరణించాడు. ఆమె ఇన్నేళ్లు దాచుకున్న డబ్బుతో పాటు భర్త బీమా సొమ్మును కూడా ఖాతాల్లోకి వేసుకుని బ్యాంక్‌లో దాచుకుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఆమె నుంచి ఆ డబ్బును కాజేయడానికి పక్కాగా ప్లాన్ వేశారు.

ఆ మహిళ వయస్సు 40 ఏళ్లు. కొద్దిరోజుల కిందట ఆమె భర్త మరణించాడు. ఆమె ఇన్నేళ్లు దాచుకున్న డబ్బుతో పాటు భర్త బీమా సొమ్మును కూడా ఖాతాల్లోకి వేసుకుని బ్యాంక్‌లో దాచుకుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఆమె నుంచి ఆ డబ్బును కాజేయడానికి పక్కాగా ప్లాన్ వేశారు. లేని అబద్దాన్ని ఉన్నట్టు చెప్పారు. ఆమె అదే నిజమనుకుని నమ్మింది. దెబ్బకు ఆ మహిళ తన ఖాతాలో ఉన్న రూ. 1.59 కోట్లు వారి అకౌంట్‌లోకి బదిలీ చేసింది. చివరికి తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోన్న మహిళ భర్త కొద్దిరోజుల క్రితం చనిపోయాడు. తద్వారా తనకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బును జాగ్రత్తగా బ్యాంక్ ఖాతాలో దాచుకుంది. ఈ క్రమంలోనే ఓ రోజు ఆమెకు ఒక కొరియర్ ఆఫీస్‌కు చెందిన వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. డ్రగ్స్‌తో ఉన్న పార్శిల్ ఒకటి మీ పేరు మీద వచ్చిందని పేర్కొన్నాడు. ఆ పార్శిల్ తనది కాదని.. తాను నిర్దోషినని పేర్కొంది బాధితురాలు. అనంతరం ముంబై పోలీస్ అధికారినంటూ ఇంకో వ్యక్తి నుంచి సదరు మహిళకు ఫోన్ వచ్చింది. ముంబై నుంచి తైవాన్‌కు వెళ్లే షిప్‌లో మీరు పేరుతో డ్రగ్స్ పార్శిల్ ఒకటి పట్టుకున్నామని.. భారీ శిక్ష తప్పదంటూ బెదిరించాడు. ముందస్తు బెయిల్ తీసుకోవడం మంచిదని సూచించాడు.
ఇక ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మిన సదరు బాధితురాలు బెయిల్ కోసం అని చెప్పి.. ఏకంగా తన ఖాతాలో దాచిపెట్టిన రూ. 1.59 కోట్లను ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. ఆ తర్వాత ఫోన్లన్నీ కూడా స్విచాఫ్ కావడంతో తాను మోసపోయానని గ్రహించి బాధితురాలు రాచకొండ సైబర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసుపై న్యాయస్థానం కొద్దిరోజుల క్రితం విచారణ జరిపి.. బాధితురాలికి రూ. 20 లక్షలు అందజేసింది.