AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు ఆగమే – సీఎం కేసీఆర్‌

ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు ఆగమైపోతారంటూ మరోసారి హెచ్చరించారు కేసీఆర్‌. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను కంపేర్‌ చేసుకోవాలన్నారు. ఎవరి పాలన బాగుందో ఆలోచించండి, ఆ తర్వాతే ఓటేయండంటూ ప్రజలను కోరారు గులాబీ బాస్‌. ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన కేసీఆర్‌...

CM KCR: ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు ఆగమే - సీఎం కేసీఆర్‌
Cm Kcr Comments
Ravi Kiran
|

Updated on: Nov 24, 2023 | 9:30 PM

Share

ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు ఆగమైపోతారంటూ మరోసారి హెచ్చరించారు కేసీఆర్‌. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను కంపేర్‌ చేసుకోవాలన్నారు. ఎవరి పాలన బాగుందో ఆలోచించండి, ఆ తర్వాతే ఓటేయండంటూ ప్రజలను కోరారు గులాబీ బాస్‌. ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన కేసీఆర్‌… ప్రతి చోటా ఈ పాయింట్‌నే హైలేట్‌ చేశారు. నొక్కినొక్కి మరీ చెప్పారు.

తెలంగాణ దంగల్‌ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ప్రచారానికి మిగిలింది ఇంకా నాలుగే నాలుగు రోజులు. అందుకే, క్యాంపెయినింగ్‌లో మరింత స్పీడ్‌ పెంచాయి పార్టీలు. వరుస సభలు, రోడ్‌షోలు, సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు మెయిన్‌ లీడర్స్‌. గులాబీ బాస్‌ కేసీఆర్‌ అయితే ఇప్పటివరకు 80 నియోజకవర్గాలను కవర్‌ చేసేశారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో ప్రచారం నిర్వహించిన కేసీఆర్‌… ఎప్పటిలాగే కాంగ్రెస్‌, బీజేపీ టార్గెట్‌గా పంచ్‌ల వర్షం కురిపించారు.

అభ్యర్ధులనే కాదు, ఆ అభ్యర్ధుల వెనుకన్న పార్టీలను చూడాలన్నారు కేసీఆర్‌. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటేయాలన్నారు గులాబీ బాస్‌. రామగుండం, ములుగు, భూపాలపల్లి సభల్లోనూ ఇదే పాయింట్‌ను మళ్లీమళ్లీ నొక్కిచెప్పారు గులాబీ బాస్‌. అభ్యర్ధుల వెనుకన్న పార్టీలను చూడకపోతే ఊహించని కష్టాలు ప్రజలను చుట్టుముడతాయంటూ హెచ్చరించారు.

కాగా, చివరి నాలుగు రోజుల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు కేసీఆర్‌. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల నవంబర్ 25న హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో కేసీఆర్ భారీ బహిరంగ సభ రద్దయింది. రేపు, ఎల్లుండి హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు వర్షసూచన ఉంది. వర్షాల నేపథ్యంలో సభను రద్దు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది.

ఇక, షెడ్యూల్ ప్రకారం.. 26న ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో… 27న షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డిలో ప్రచారం నిర్వహిస్తారు సీఎం కేసీఆర్. చివరి రోజు, అంటే 28న వరంగల్‌ ఈస్ట్‌ అండ్ వెస్ట్‌తోపాటు సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో క్యాంపెయినింగ్‌ను ముగిస్తారు కేసీఆర్‌.