Telangana: అధికారంలోకి రాగానే తెలంగాణలో అవినీతిపరుల భరతం పడతాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Telangana Election 2023: తెలంగాణలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అధికారంలోకి రాగానే అవినీతిపరులను జైలుకు పంపిస్తామని బీజేపీ జాతీయ నాయకులు హెచ్చరించారు. పదేళ్లలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. మరోవైపు మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో నిర్వహించిన బీజేప విజయ సంకల్ప సభకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పదేళ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చి.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు రాజ్‌నాథ్.

Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ ప్రచారం ఉధృతం చేసింది. ఆర్మూర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారాయన. పసుపు పరిశోధనలు కూడా చేపడతామన్నారు. నిజామాబాద్‌లో బీడీ కార్మికులకు ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. గల్ఫ్ వెళ్లేవారికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామన్నారు షా. తెలంగాణలో అధికారంలోకి రాగానే అవినీతిపరుల భరతం పడతామన్నారు షా.
ఆర్మూర్ సభ అనంతరం షా రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేటలో జరిగిన రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఒవైసీకి భయపడే కేసీఆర్ విమోచన దినం జరపడం లేదని షా విమర్శించారు. కారు స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో ఉందన్నారు.
మరోవైపు మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో నిర్వహించిన బీజేప విజయ సంకల్ప సభకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పదేళ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చి.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు రాజ్‌నాథ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు రాజ్‌నాథ్.
అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో మూడు రోజుల పాటు మకాం వేయనున్నారు. ఆరుకు పైగా సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




