AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. శని, ఆదివారాల్లో ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం (నేడు) తెలంగాణకు వస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 25,26 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ జి. సుధీర్‌ బాబు తెలిపారు...

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. శని, ఆదివారాల్లో ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..
Hyderabad Traffic
Narender Vaitla
|

Updated on: Nov 25, 2023 | 7:01 AM

Share

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఈ నెల 28వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో పార్టీలన్నీ తమ శక్తిమేరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే అగ్ర నేతలంతా సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన జాతీయ నాయకులు తెలంగాణకు క్యూ కడుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం (నేడు) తెలంగాణకు వస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 25,26 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ జి. సుధీర్‌ బాబు తెలిపారు.

శనివారం సాయత్రం 5:20 గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో.. ఇక్కడి వై.జంక్షన్‌, పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా రాజ్‌భవన్‌ చేరుకుంటారు. 26న ఉదయం 10:35 నుంచి 11:05 మధ్య ప్రధాని రాజ్‌భవన్‌ నుంచి ఎంఎంటీఎస్‌, యశోద ఆసుపత్రి, బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి వెళతారు. ఆ వేళల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

మోదీ షెడ్యూల్‌ విషయానికొస్తే తొలుత మధ్యాహ్నం 1.30 గంటలకు దుండిగల్‌ ఏయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కామారెడ్డిలో బహిరంగ సభలో మధ్యాహ్నం 2.15 గంటలకు పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు తుక్కుగుడలో బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్‌భవన్ వెళ్తారు. అక్కడే బస చేస్తారు. అనంతరం ఆదివారం దుబ్బాక, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో పర్యటించి.. బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఈనెల 27 సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షోతో మోదీ తెలంగాణా ఎలక్షన్ టూర్ పూర్తవుతుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..