Hyderabad: తెలంగాణలో వచ్చే 4 రోజులు మోస్తరు వర్షాలు.. ఆ జిల్లాలకు హైఅలెర్ట్.!

Hyderabad: తెలంగాణలో వచ్చే 4 రోజులు మోస్తరు వర్షాలు.. ఆ జిల్లాలకు హైఅలెర్ట్.!

Ravi Kiran

|

Updated on: Nov 24, 2023 | 9:13 PM

ప్రచారానికి ఇంకా కొన్నిరోజులు మాత్రమే సమయం ఉండడంతో.. ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అయితే పార్టీల ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. రానున్న నాలుగైదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ప్రచారానికి ఇంకా కొన్నిరోజులు మాత్రమే సమయం ఉండడంతో.. ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అయితే పార్టీల ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. రానున్న నాలుగైదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే కేరళ, తమిళనాడు తీరంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలోని సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నల్గొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 27.5 మి.మీ. వర్షపాతం నమోదవ్వగా.. మెదక్‌లో 17 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. చల్ల గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.