AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Harish Rao: ఎన్ని ట్రిక్కులు వేసినా గెలిచేది మా పార్టీనే.. బిజెపి, కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు విమర్శలు..

ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్స్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని అలా ఏమైనా ఉంటే చెప్పాలి అన్నారు.. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేద్దామని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారన్నారు.. తెలంగాణ కోసం కేంద్రంలో కొట్లాడం కాంగ్రెస్ పార్టీకి చేతకాదు అని..తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి నేర్చుకుని మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు మంత్రి హరీష్ రావు..

Minister Harish Rao: ఎన్ని ట్రిక్కులు వేసినా గెలిచేది మా పార్టీనే.. బిజెపి, కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు విమర్శలు..
Minister Harish Rao
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 13, 2023 | 10:14 PM

కాంగ్రెస్స్ పార్టీకి సవాలు విసిరారు మంత్రి హరీష్ రావు. 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని.. దీని పై చర్చకు వస్తారా..? చర్చకు తాను సిద్ధం అన్నారు.. హుస్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్స్, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏ రంగంలోనైన తెలంగాణతో పోటీ పడతాయా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్స్, బీజేపీ వాళ్లు రాష్ట్రంలో ఎన్ని ట్రిక్కులు చేసిన తెలంగాణలో మళ్ళీ గెలిచేది కేసీఆరే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎన్నికలు దగ్గరికి రాగానే టెంట్లు వేసి స్టంట్ లు చేస్తారని వీరిని ప్రజలు నమ్మరు అని అన్నారు మంత్రి హరీష్ రావు.. తెలంగాణ రాష్ట్రం పై బిజెపి, కాంగ్రెస్ కు బరువు..బాధ్యత లేదని 60 ఏళ్లు అధికారంలో ఉండి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అన్నారు.

ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్స్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని అలా ఏమైనా ఉంటే చెప్పాలి అన్నారు.. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేద్దామని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారన్నారు.. తెలంగాణ కోసం కేంద్రంలో కొట్లాడం కాంగ్రెస్ పార్టీకి చేతకాదు అని..తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి నేర్చుకుని మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు మంత్రి హరీష్ రావు..నిందలు వేయడంతో పాటు మతతత్వ పార్టీని నిరోధిస్తున్న పార్టీ బీజేపీ అని మండిపడ్డారు..అబద్ధాల కాంగ్రెస్ కు,అభివృద్ధి సాధించిన బీఆర్ఎస్ పార్టీ విజయాలకు పోటీ అన్నారు ఈ ఎన్నికలు…

ప్రతి ఇంటికి లబ్ధి..

అనంతరం రసవత్తరంగా సాగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు ఈసారి కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ తన విమర్శలను కొనసాగించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందన్నారు. భిన్నమైన విధానాన్ని అవలంబిస్తూ, కాంగ్రెస్ మరియు బిజెపి అవమానాలకు పాల్పడుతుండగా, BRS సహాయ కిట్‌లకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

ఏడాదిలోపే నిర్మించి నిలిచాం..

ఈ నియోజకవర్గంలో తండాలు గ్రామపంచాయతీలు అయ్యాంటే.. గౌరెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందంటే.. ఇది కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. మిడ్ మానేర్ ద్వారా గోదావరి నీళ్లను హుస్నాబాద్ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. గండి మహాసముద్రం ఏడాదిలోపే నిర్మించి నిలిచామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం