AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది: కేటీఆర్‌

రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఇతర..

KTR: పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది: కేటీఆర్‌
Minister Ktr
Subhash Goud
|

Updated on: Sep 13, 2023 | 9:20 PM

Share

సంగారెడ్డి, సెప్టెంబర్‌ 13: తెలంగాణలో ఇన్వెస్ట్‌మెంట్లు చేసే కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం గుంతపల్లిలో మోనిన్‌ పరిశ్రమకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మోనిన్‌ కంపెనీ దేశంలోనే ఫస్ట్‌ యూనిట్‌గా సంగారెడ్డి డిస్ట్రిక్స్‌లో ఏర్పాటు చేస్తోందని అన్నారు. సుమారు 300 కోట్ల రూపాయలకుపైగా ఇన్వెస్ట్‌మెంట్‌లో 40 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమను నిర్మించనుందని తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటు అయితే సుమారు 400 మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఎవరు ఎలాంటి పరిశ్రమను ఏర్పాటు చేసినా కేరాఫ్‌ అండ్రస్‌ తెలంగాణనేనని అన్నారు.

మన ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అన్నంపెట్టే రాష్ట్రంగా మారిందని, రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి జరుగనుందన్నారు. రాష్ట్రంలోని స్థానిక ప్రజాప్రతినిధులు మీమా ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చినట్లయితే సహకరించాలని సూచించారు. దీని వల్ల నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా కంపెనీలు స్థాపిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సహకరించి ఉపాధి కల్పించే విధంగా సహకరించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. తెలంగాన సర్కార్‌ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు తగిన సింగిల్‌ విండో విధానంలో అనుమతులు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అభివృద్ధిని ఓర్వలేక కొన్ని పార్టీలో లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని, అభివృద్ధి అడ్డు పడేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్‌ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలు సైతం అభివృద్ధి జరిగేలా సీఎం కేసీఆర్‌ నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు. యువత నుంచి వృద్ధుల వరకు అందరికి న్యాయం జరిగేలా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధి పనులే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని వ్యాఖ్యానించారు.

Follow Us