తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అరగంటలోనే ఆ నిర్ణయం: హిమంత బిశ్వ శర్మ

ఓవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శనస్త్రాలు ఎక్కుపెడుతూనే మరోవైపు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అటు అధికార బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇక తామేమి తక్కువ కాదన్నట్లు బీజేపీ సైతం హామీలు కురిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కొన్ని ప్రాంతాల పేర్లను మారుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి కొనసాగింపుగా...

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అరగంటలోనే ఆ నిర్ణయం: హిమంత బిశ్వ శర్మ
BJP
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 24, 2023 | 3:51 PM

తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ రక్తి కడుతోంది. ఎన్నికలకు ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇక ప్రచారానానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది.28వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ తమ శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మరో ఆసక్తికర హామీనిచ్చింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అరగంటలోనే హైదరాబాద్ పేరు మారుస్తామంటున్నారు.

ఇక ప్రచారంలో భాగంగా ఓ వైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శనస్త్రాలు ఎక్కుపెడుతూనే మరోవైపు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అటు అధికార బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇక తామేమి తక్కువ కాదన్నట్లు బీజేపీ సైతం హామీలు కురిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కొన్ని ప్రాంతాల పేర్లను మారుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి కొనసాగింపుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరో ఆసక్తికర హామీని ఇచ్చారు.

ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన అస్సాం సీఎం.. చార్మినార్ వద్ద నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అరగంటలో హైదరాబాద్ పేరును మారుస్తామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ పేరును భాగ్య నగర్‌గా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరూ పెద్దగా అభ్యంతరం కూడా చెప్పరని హేమంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే