Telangana Election: పక్కాగా తెలంగాణ ఓట్ల లెక్కింపు.. రాష్ట్రానికి 119 మంది పరిశీలకులను నియమించిన సీఈసీ
మరో మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. ఇక ప్రజలు తమ అమూల్యమైన ఓటు ఎవరికి వేయ్యనున్నారు..? ఎవరికి అధికారం కట్టబెట్టానున్నారు..? అనే అంశంపై మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల పోలింగ్ జరిగిన రెండు రోజుల తరువాత ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మరో మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. ఇక ప్రజలు తమ అమూల్యమైన ఓటు ఎవరికి వేయ్యనున్నారు..? ఎవరికి అధికారం కట్టబెట్టానున్నారు..? అనే అంశంపై మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల పోలింగ్ జరిగిన రెండు రోజుల తరువాత ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రానికి 119 మంది పరిశీలికలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించింది. సాధారణ పోలీసు పరిశీలకులు 166 మంది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణకు మరో ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కూడా ఎన్నికల సంఘం పంపిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు తెలిపారు.
హైదరాబాదులో బి ఆర్ కే భవన్ లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఓట్ల లెక్కింపు కేంద్రాలను పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఎన్నికల పరిశీలకుల ఆమోదం తర్వాతే ప్రతి రౌండ్ వివరాలు ప్రకటిస్తారు. లెక్కింపు కేంద్రాల వద్ద ముడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు తెలిపారు
ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈవీఎంల తనిఖీ శుక్రవారంతో ముగుస్తుంది. ఓటరు సమాచార స్లిప్లను పంపిణీ దాదాపు పూర్తయింది. ఇక ఓటు ఎలా వేయాలి బ్యాలెట్ యూనిట్లు ఎలా గుణిగించుకోవాలని అనే సమాచారాన్ని వాటిలో పొందుపరిచారు ఎన్నికల అధికారులు. ప్రస్తుతం ఇంటి నుంచి ఓటింగ్‌తో పాటు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది. అన్ని జిల్లాలో నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారుల కోసం కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు వికాస్ రాజ్. బ్యాలెట్ పత్రాలను బ్యాలెట్ బాక్సుల్లో వెయ్యా.లి సర్వీస్ ఓటర్లకు ఎలక్ట్రానిక్ విధానంలో బ్యాలెట్ పత్రాలు పంపుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు 9,813 మంది డౌన్‌లోడ్ చేసుకోగా, వాటిని ప్రింట్ తీసుకుని ఓటు వేసి పోస్ట్ ద్వారా లెక్కింపు నాటికి పంపాల్సి ఉంటుంది.
ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎన్నికల ప్రధానాధికారి. రాష్ట్రంలోని 40,000 మంది పోలీసు పలగాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి 25 వేల మంది పోలీసులను బందోబస్తులో వినియోగిస్తున్నామని తెలిపారు. 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి కేటాయించింది. ఒకే ప్రాంతంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను సైతం నియమిస్తామని ఆయన తెలిపారు. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానించినట్లు తెలిపారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో 669 కోట్ల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో రూ. 260 కోట్ల నగదు ఉండగా, రూ. 81 కోట్ల విలువ చేసే ఉచితాలు ఉన్నాయి. అలాగే, ఎన్నికల కోడ్ ఉల్లంగించినందుకు 774 కేసులు నమోదు చేశామని వికాస్ రాజ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
