Andhra Pradesh: ఊర్లో పిల్లలు కిడ్నాప్ పుకార్లు.. రాఘవయ్య పార్క్‌లో క్షేమంగా చిన్నారులు

ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు అన్న వదంతులతో అందరూ హడలి పోయారు. అయితే అంతలో ఒక పిల్లవాడిని విజయవాడకి చెందిన ఆటో డ్రైవర్ తెచ్చి తెనాలి లోని ఆ పిల్లవాడి ఇంట్లో వదలడంతో కిడ్నప్ అయిన పిల్లలు విజయవాడలో ఉన్నారన్న విషయం వెల్లడైంది. పోలీసులు రంగంలోకి దిగి ఆ కోణంలో దర్యాప్తు చేసి అసలు విషయాన్ని రాబట్టారు.. అసలేం జరిగిందంటే..

Andhra Pradesh: ఊర్లో పిల్లలు కిడ్నాప్ పుకార్లు.. రాఘవయ్య పార్క్‌లో క్షేమంగా చిన్నారులు
Rumours Over Kidnap Attempt
Follow us
T Nagaraju

| Edited By: Surya Kala

Updated on: Nov 25, 2023 | 11:44 AM

తెనాలి చినరావూరులో పిల్లల కిడ్నాప్ అంటూ శుక్రవారం పుకార్లు, షికారు చేశాయి. మధ్యాహ్నం వరకు ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అయ్యారని, సాయంత్రం మరో ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అయ్యారని పుకార్లు రావడంతో తెనాలి పట్టణంలోని ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ నలుగురు పిల్లల కోసం ఆ ప్రాంత ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారు. పిల్లల కోసం వెతుకులాట ముమ్మరం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడంతో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు అన్న వదంతులతో అందరూ హడలి పోయారు. అయితే అంతలో ఒక పిల్లవాడిని విజయవాడకి చెందిన ఆటో డ్రైవర్ తెచ్చి తెనాలి లోని ఆ పిల్లవాడి ఇంట్లో వదలడంతో కిడ్నప్ అయిన పిల్లలు విజయవాడలో ఉన్నారన్న విషయం వెల్లడైంది. పోలీసులు రంగంలోకి దిగి ఆ కోణంలో దర్యాప్తు చేసి అసలు విషయాన్ని రాబట్టారు.. అసలేం జరిగిందంటే..

తెనాలి చినరావూరికి చెందిన 13 ఏళ్ల బాలిక తన తమ్ముడితో సహా మరో ఇద్దరు పిల్లలను విజయవాడ రాఘవయ్య పార్కు చూద్దాం అని ట్రైన్ లో విజయవాడకి తీసుకువెళ్లింది. పార్కులో అందరూ ఆడుకుంటుండగా ఒక పిల్లవాడు నిద్ర పోయాడు. మిగతా వారు ఆడుకుంటుండగా ఆ పిల్లవాడు  లేచి చూసే సరికి వీళ్ళు కనిపించక పోవడంతో బయటకు వచ్చి ఏడుస్తుండగా ఆ ప్రాంతంలో ఉన్న ఆటో డ్రైవర్ ఆ పిల్లవాడిని వివరాలు అడిగి తెలుసుకుని తెనాలిలోని వారి ఇంటికి తెచ్చాడు.

ఆటో డ్రైవర్ సమాచారంతో రాఘవయ్య పార్కు వద్ద మిగతా పిల్లలు వుంటారని తెలుసుకుని తెనాలి పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఒక బాలిక తమతో పాటు వచ్చిన ఒక పిల్లవాడు మిస్ అయ్యాడని రాఘవయ్య పార్క్ లో ఎనౌన్స్ చేయించిదనే విషయాన్నీ గుర్తించారు. ఆ తర్వాత పార్క్ నుండి వెళ్లిపోయారని అక్కడ పోలీసులకు పార్కు సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత రైల్వే పోలీసుల ద్వారా ఆ బాలిక ఇద్దరు పిల్లలతో సహా తెనాలి వైపు వెళ్లే రైలు ఎక్కినట్టు చెప్పడంతో పోలీసులు తెనాలి రైల్వే స్టేషన్ చేరుకొని, రైలు నుండి దిగిన ఆ పిల్లలను తీసుకొని తల్లిదండ్రులకు మీడియా ఎదుట అప్పగించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు డిఎస్పి జనార్దన్ రావు. డీఎస్పీ జనార్దన్ రావులు ఐజి అభినందించగా, తెనాలి పోలీస్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు. ఈ సందర్భంగా మా పిల్లలను క్షేమంగా చేర్చారు అంటూ పిల్లల తల్లిదండ్రులు డిఎస్పి ని సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. పిల్లల రాకతో తెనాలిలో పిల్లల కిడ్నాప్ అంటూ చేస్తున్న పుకార్లకు తెరపడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..