Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hide and Seek Game: అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి

రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో పాయల్, రితిక అనే ఇద్దరు కజిన్ సిస్టర్స్ మధ్యాహ్నం తమ ఇంట్లో దాగుడుమూతలు ఆడుతున్నారు. ఆడుకుంటుండగా ఇద్దరూ వెళ్లి ఇంట్లోని పాడైన  డీప్ ఫ్రీజర్ లో దాక్కున్నారు. అప్పుడు ఫ్రిజ్ ఆటోమేటిక్ గా లాక్ పడింది. తర్వాత తలుపు తెరచుకోక పోవడంతో ఇద్దరు అక్కచెల్లెలు చాలా సేపు ఫ్రిజ్‌లోనే ఉండిపోయారు. బాలికల కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

Hide and Seek Game: అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి
Hide And Seek Game
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2023 | 7:45 AM

రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో ఓ విషాదకరమైన ఘటన వెలుగు చూసింది. దాగుడుమూతలు ఆడుతున్న ఇద్దరు అక్కా చెల్లెల్లు ఇంట్లో నిరుపయోగంగా పడి ఉన్న డీప్‌ఫ్రీజర్‌లో దాక్కున్నారు. ఈ సమయంలో ఫ్రీజర్ బయటి నుంచి లాక్ అయింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. కొద్ది సేపటి క్రితం వరకు తమ కళ్ళ ముందు చకచకా పరుగు పెడుతూ ఆడుకున్న అక్కాచెల్లెళ్లు ఇక ఈ లోకంలో లేరని తెలిసిన వెంటనే ఇరు కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నారులను మృత్యువు పొట్టన పెట్టుకుందని తెలిసినా ఆ ప్రాంత వాసులు ఎవరూ నమ్మడం లేదు.

ఈ ఘటనను ధృవీకరిస్తూ గురువారం మధ్యాహ్నం ఖమ్నోర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భవానీ శంకర్ తెలిపారు. ఇద్దరు కజిన్ సిస్టర్స్ ఇంట్లో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఈ సమయంలో ఇంట్లో ఉపయోగించకుండా ఓ మూలన ఉన్న ఫ్రిజ్ లో దాక్కున్నారు. ఊపిరి ఆడక  మరణించారు.

మీడియా కథనాల ప్రకారం రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో పాయల్, రితిక అనే ఇద్దరు కజిన్ సిస్టర్స్ మధ్యాహ్నం తమ ఇంట్లో దాగుడుమూతలు ఆడుతున్నారు. ఆడుకుంటుండగా ఇద్దరూ వెళ్లి ఇంట్లోని పాడైన  డీప్ ఫ్రీజర్ లో దాక్కున్నారు. అప్పుడు ఫ్రిజ్ ఆటోమేటిక్ గా లాక్ పడింది. తర్వాత తలుపు తెరచుకోక పోవడంతో ఇద్దరు అక్కచెల్లెలు చాలా సేపు ఫ్రిజ్‌లోనే ఉండిపోయారు.

ఇవి కూడా చదవండి

ఊపిరాడక బాలికలు మృతి

బాలికల కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో, ఆరుబయట అన్ని చోటల్లా వెదకడం ప్రారంభించిన కుటుంబ సభ్యులు తలుపు మూసి ఉన్న ఫ్రిడ్జ్ ను తెరచి చూడాగా చిన్నారులు కనిపించారు. అది చూసి షాక్ తో కేకలు వేశారు. అప్పటికే డీప్ ఫ్రీజర్‌లోని ఇద్దరి మృతదేహాలు గడ్డకట్టిపోయాయి.

బాలికలిద్దరూ ఫ్రీజర్‌లో శవాలై పడి ఉన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాలికల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.

అమ్మాయిల ప్రాణాలు తీసిన హైడ్ అండ్ సీక్ గేమ్

పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం.. కజిన్‌ సోదరులిద్దరి తండ్రులు ముంబైలో పనిచేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వారు ఇంటికి తిరిగి వస్తున్నారు. వారు తిరిగి వచ్చిన తర్వాత, బాలికల అంత్యక్రియలు కలిసి నిర్వహిస్తారు.

కాగా, ఈ ఘటన కుటుంబసభ్యులతో పాటు ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు తమ మధ్య లేరంటే నమ్మలేకపోతున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.

అమ్మాయిల పేర్లు పాయల్, రితిక. పాయల్ వయసు 10 ఏళ్లుగా, రితికా వయసు 11 ఏళ్లు. ఆడపిల్లలిద్దరూ ఎప్పుడూ కలిసి ఆడుకునేవారని ఈ రోజు కూడా దాగుడు మూతలు కలిసే ఆడుకున్నారని.. ఈ సమయంలో ఫ్రీజర్‌లో దాక్కున్నారని, అదే వారి మరణానికి కారణమని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..