Vastu Tips: ఆత్మవిశ్వాసాన్ని పెంచే వాస్తు టిప్స్‌.. ఇవి పాటిస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది.

అయితే వాస్తు కేవలం ఇంట్లో ఉండే వారి ఆర్థిక, శారీరక ఆరోగ్యాలపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. సాధారణంగా మనలో కొంత మంది నిత్యం ఆత్మన్యూనత భావంతో ఉంటారు. ఇలాంటి వారిలో ఆత్మవిశ్వాసం అనేదే ఉండదు. తమపై తమకే నమ్మకం లేక నిత్యం మానసిక సంఘర్షణకు గురవుతుంటారు. అయితే వాస్తులో కొన్ని చిట్కాలు పాటిస్తే..

Vastu Tips: ఆత్మవిశ్వాసాన్ని పెంచే వాస్తు టిప్స్‌.. ఇవి పాటిస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది.
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 25, 2023 | 5:02 PM

మనలో వాస్తును విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. భారతీయులను, వాస్తును విడదీసి చూడలేము. అందుకే ప్రతీ చిన్న విషయంలో వాస్తు శాస్త్రం ఆధారంగా వ్యవహరిస్తుంటారు. కేవలం ఇంటి నిర్మాణానికే పరిమితం కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ వాస్తును పాటిస్తుంటారు.

అయితే వాస్తు కేవలం ఇంట్లో ఉండే వారి ఆర్థిక, శారీరక ఆరోగ్యాలపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. సాధారణంగా మనలో కొంత మంది నిత్యం ఆత్మన్యూనత భావంతో ఉంటారు. ఇలాంటి వారిలో ఆత్మవిశ్వాసం అనేదే ఉండదు. తమపై తమకే నమ్మకం లేక నిత్యం మానసిక సంఘర్షణకు గురవుతుంటారు. అయితే వాస్తులో కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

* ఆత్మన్యూనత భావంతో ఉండేవారు, ఆత్మవిశ్వాసం లేని వారు ప్రతిరోజూ ఉదయాన్నే గాయత్రీ మంత్రాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు. ఇలా ప్రతీ రోజూ చేయడం వల్ల మీలో ఆత్మ విశ్వాసం పెరగడంతో పాటు పాజిటివ్‌ థింకింగ్‌ అలవాటు అవుతుంది.

* ఇక మీరు వ్యాపారం చేస్తుంటే మీరు కూర్చునే సీటు వెనకాల పర్వతాలు ఉండే ఫొటోను పెట్టుకోమని వాస్తు పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల కూడా మంచి మార్పులు గమనించవచ్చని చెబుతున్నారు.

* అలాగే ఎవరిలో అయితే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంటే అలాంటి వారు పక్షులకు నీరు, ఆహారం ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

* ఇక బెడ్‌రూమ్‌లో ఉదయిస్తున్న సూర్యూడి ఫొట లేదా పరిగెత్తుతోన్న గుర్రం ఫొటోను ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఇలాంటి ఫొటోలను చూడడం ద్వారా పాజిటివ్‌ థింకింగ్‌తో రోజు ప్రారంభించొచ్చు.

* కొందరు నిత్యం తలుపులు, కిటికీలు మూసి ఉంచుతారు. అయితే అలా చేయకూడదు. ఇంట్లోకి గాలి, వెలుతురు దారాలంగా వచ్చేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. స్వచ్ఛమైన గాలి, వెలుతురు వస్తే మంచిదని గుర్తించాలి.

* పండితుల అభిప్రాయం ప్రకారం.. శునకాలకు ఆహారం ఇవ్వడం, ఆవులకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీలో ఆత్మ విశ్వాసం రెట్టింపవుతుంది.

* ఇక ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యూడిని ఆరాధించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల పాజిటివ్‌ థింకింగ్ పెరుగుతుందని అంటున్నారు. సూర్య కాంతిలో ఉండడం వల్ల విటమిన్‌ డీ విరివిగా లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది మనిషి ఆలోచన విధానంపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..