AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Festival 2024: రాఖీ పండగ రోజున భద్ర నీడ ఎప్పుడు? రాఖీ ఎందుకు కట్టరు..? అసలు భద్ర ఎవరో తెలుసా..!

రాఖీ పండగను జరుపుకోవడం లేదా భద్రాకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా సోదరీమణులు తమ సోదరులకు శుభ సమయంలో మాత్రమే రాఖీ కడతారు. రక్షాబంధన్ శుభ సందర్భంగా భద్ర నీడ అంటే ఏమిటి? ఈ సమయంలో రాఖీ పండగను జరుపుకోవడం లేదా పవిత్రమైన పని చేయడం ఎందుకు అశుభమైనదిగా భావిస్తారో తెలుసుకుందాం..

Rakhi Festival 2024: రాఖీ పండగ రోజున భద్ర నీడ ఎప్పుడు? రాఖీ ఎందుకు కట్టరు..? అసలు భద్ర ఎవరో తెలుసా..!
Rakhi Festival 2024
Surya Kala
| Edited By: TV9 Telugu|

Updated on: Aug 12, 2024 | 11:46 AM

Share

రాఖీ పండగను ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి తిధి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారికి మంచి జరగాలని కోరుకుంటారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు రక్షణ కల్పిస్తామని బాస చేసి బహుమతులు ఇస్తారు. భద్ర నీడ ఎక్కువగా రాఖీ పండుగ రోజున వస్తుంది. దీని కారణంగా రాఖీ కట్టే సమయం విషయంలో శుభా ఆశుభాలను చూసుకుంటారు. ఎందుకంటే భద్ర నీడ సమయంలో రాఖీ పండగను జరుపుకోవడం లేదా భద్రాకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా సోదరీమణులు తమ సోదరులకు శుభ సమయంలో మాత్రమే రాఖీ కడతారు. రక్షాబంధన్ శుభ సందర్భంగా భద్ర నీడ అంటే ఏమిటి? ఈ సమయంలో రాఖీ పండగను జరుపుకోవడం లేదా పవిత్రమైన పని చేయడం ఎందుకు అశుభమైనదిగా భావిస్తారో తెలుసుకుందాం..

ఈ ఏడాది రాఖీ పండగ సమయంలో భద్ర నీడ ఎప్పుడంటే

ఈ ఏడాది రాఖీ పండగ రోజున మధ్యాహ్నం 12.30 గంటల వరకు భద్ర నీడ ఉండగా.. దీని ప్రభావం మాత్రం మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది. ఈ కాలంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోరు. ఈ కారణంగానే ఈసారి రాఖీ పండుగను మధ్యాహ్నం జరుపుకోనున్నారు.

భద్ర ఎవరంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్ర నీడ ప్రత్యేకమైన సమయం. ఈ సమయంలో ఎటువంటి శుభం లేదా శుభ కార్యాలు జరగవు. భద్ర కాలాన్ని విష్టి కరణం అంటారు. భద్ర కాలంలో చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం. భద్ర నీడకు సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. దీనికి కారణం కొన్ని పురాణాలలో వివరించబడింది. పురాణాల ప్రకారం భద్ర సూర్య భగవానుడు భార్య ఛాయా కుమార్తె. శనిశ్వరుడి సోదరి.

ఇవి కూడా చదవండి

రక్షాబంధన్ ఎప్పుడు? రాఖీ కట్టడానికి తేదీ, శుభ సమయం ఎప్పుడంటే

భద్ర పుట్టకముందే ఛాయ దేవి శివ భక్తులురాలు. శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేసి తన కుమార్తెకు అద్వితీయమైన శక్తులు ఉండాలనే వరం పొందింది. ఈ వరం కారణంగా భద్ర పుట్టినప్పటి నుంచి చాలా శక్తివంతమైన, ప్రత్యేకమైన శక్తులకు యజమాని. అందుకే భద్రను విష్టి కారణం అని కూడా పిలుస్తారు.

భద్ర స్వభావం పుట్టినప్పటి నుంచి క్రూరమైనది. కఠినమైనది. దీని కారణంగా తన ప్రభావంతో ఎవరికైనా లేదా మరొకరికి హాని చేయడంలో ఎప్పుడూ భద్ర బిజీగా ఉండేది. భద్ర యజ్ఞ యగాదుల్లో అడ్డంకులు సృష్టించడం ప్రారంభించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భద్ర చర్యలపై ఆందోళన మొదలైంది. భద్ర దుష్ట స్వభావం కారణంగా సూర్య దేవుడు ఆమె వివాహం గురించి చింతించడం ప్రారంభించాడు. ఒకరోజు సూర్య దేవుడు తన ఆందోళనను తెలియజేసేందుకు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లాడు.

అప్పుడు బ్రహ్మ దేవుడు భద్రను ఆకాశంలో ఉండేలా చేయమని ఆదేశించాడు. ఇలా చేయడం వలన భూమిపై భద్ర ప్రభావం తక్కువగా ఉంటుంది. భద్ర ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే భూమిపైకి రావడానికి అనుమతినించారు. అందుకే భద్ర భూమిపైకి వచ్చే కాలాన్ని భద్ర నీడగా పిలుస్తారు. అంతేకాదు ఇలా భద్ర నీడ భూమి మీద పడే సమయంలో ఎవరైనా గృహప్రవేశం లేదా ఇతర శుభకార్యాలు, పూజలు చేస్తే వాటిల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. ఇలా భద్రకు అనుమతి ఇచ్చాడు బ్రహ్మ. ఈ సమయంలో చేపట్టే పనిలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అప్పటి నుంచి భద్ర తన కాలంలో భూమి మీద ఉన్న అన్ని జీవులకు ఇబ్బందిని కలిగించడం ప్రారంభించిందని నమ్ముతారు. ఇలా భద్ర నీడ పుట్టింది.

భద్ర కాలంలో అననుకూల ప్రభావం

నమ్మకాల ప్రకారం భద్ర కాలాన్ని అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో చేసిన పని విజయవంతం కాదు. ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. భద్ర కాలంలో భద్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని.. ఇది ఏ శుభ కార్యంలోనైనా అడ్డంకులు సృష్టిస్తుందని నమ్ముతారు. అందువల్ల భద్ర కాలంలో వివాహం, ప్రయాణం, ఇతర శుభకార్యాలు నిషేధించబడ్డాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు