దేశంలో కొనసాగుతున్న వరదల బీభత్సం.. ఉత్తరాఖండ్ , యూపీ,గుజరాత్ , బెంగాల్‌లో భారీవర్షాలు.. కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత
ఉత్తరాదితో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో ఆగని కుంభవృష్టి.. హిమాచల్‌లో తొమ్మింది మంది మృతి చెందగా... భారీ వరదలతో 50 మంది గల్లంతు అయ్యారు. హిమాచల్‌లో 100కి పైగా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. గత ఏడాది వరదల నుంచి కోలుకోని హిమాచల్‌ను మళ్లీ ప్రకృతి పగబట్టింది. వరద బీభత్సానికి కులు-మనాలి హైవే డ్యామేజ్ అయ్యింది. రాంపూర్‌లో తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించిన ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలను వేగవంతం చేసింది.
దేశవ్యాప్తంగా వరదల బీభత్సం కొనసాగుతోంది. వరుణడి ప్రకోపానికి ఉత్తర భారతం విలవిల్లాడుతోంది. ఉత్తరాఖండ్ నుంచి రాజస్థాన్ వరకు జల ప్రళయం కొనసాగుతోంది. హిమాచల్, ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, ఢిల్లీలో భారీవర్షాలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. హిమాచల్‌లో క్లౌడ్‌బరస్ట్ కారణంగా గల్లంతైన 55 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు . ఇప్పటివరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. కొండచరియలు విరిగిపడడంతో సహాయక చర్యలుకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
హిమాచల్‌లో..
ఉత్తరాదితో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో ఆగని కుంభవృష్టి.. హిమాచల్‌లో తొమ్మింది మంది మృతి చెందగా… భారీ వరదలతో 50 మంది గల్లంతు అయ్యారు. హిమాచల్‌లో 100కి పైగా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. గత ఏడాది వరదల నుంచి కోలుకోని హిమాచల్‌ను మళ్లీ ప్రకృతి పగబట్టింది. వరద బీభత్సానికి కులు-మనాలి హైవే డ్యామేజ్ అయ్యింది. రాంపూర్‌లో తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించిన ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలను వేగవంతం చేసింది.
ఉత్తరాఖండ్ లో .
భారీవర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్ సహా 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గౌరీఖుండ్ దగ్గర భక్తులను తీసుకెళ్లే గుర్రాలు కూడా వరదలో చిక్కుకున్నాయి. దీంతో వాటికోసం హెలికాప్టర్లలో ఆహారాన్ని పంపించారు.
పశ్చిమ బెంగాల్ లో..
బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి కురిసినప్పటికి , వరదనీరు ప్రవేశించినప్పటికి కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు యథాతధంగా కొనసాగాయి. ఎయిర్‌పోర్ట్ లోని రన్‌వేతో పాటు , ట్యాక్సీవే లోకి కూడా వరదనీరు ప్రవేశించింది. వరదనీటి లోనే విమానాలను నిలిపారు. అయితే ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక్క విమానం కూడా రద్దు కాలేదని అధికారులు వివరణ ఇచ్చారు.
కోల్‌కతాతో పాటు బీర్బమ్ , వెస్ట్ మిడ్నాపూర్ , బరక్‌పూర్ , హౌరాలో కూడా భారీవర్షం కురిసింది. కోల్‌కతాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. పురూలియా, ముర్షీదాబాద్ , మాల్దా , కూచ్‌బిహార్ , జల్‌పాయ్‌గురి , కలింపాగ్ , అలీపుర్‌దువార్ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు రెడ్‌అలర్ట్ జారీ చేశారు. 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గుజరాత్ లో..
గుజరాత్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. డాంగ్స్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్థంగా మారింది. వరదనీటిలో ఓ లారీ చిక్కుకుపోయింది. అయితే లారీ డ్రైవర్‌ను సహాయక సిబ్బంది క్షేమంగా రక్షించారు.. సూరత్ , వడోదర , పోర్‌బందర్ తదితర ప్రాంతాల్లో కూడా వరదలతో చాలా నష్టం జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో
ఢిల్లీని యుమునా నది వరద ఉధృతి మరింత పెరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు. యూపీ, బీహార్‌లో 40 జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..