AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nag Panchami 2024: పితృ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. నాగ పంచమి రోజున ఈ పరిహారాలు చేయండి..

ఈ ఏడాది (2024) ఆగస్టు 9న నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. పంచమి తిది ఆగస్టు 9న ఉదయం 8:15 గంటలకు ప్రారంభమై మర్నాడు ఆగస్టు 10న ఉదయం 06:09 గంటలకు ముగుస్తుంది. కనుక ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం లేదా పితృదోషం ఉంటే నాగ పంచమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆ చర్యలు ఏమిటో తెలుసుకుందాం..

Nag Panchami 2024: పితృ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. నాగ పంచమి రోజున ఈ పరిహారాలు చేయండి..
Nag Panchami
Surya Kala
|

Updated on: Aug 04, 2024 | 8:03 AM

Share

శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమిని జరుపుకుంటారు. నాగ పంచమి పాములకు అంకితం చేయబడిన పండగ. శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగలో మహాభారతం, నారద పురాణం, స్కంద పురాణం మొదలైన వాటిలో శివుడితో పాటు పాము దేవుడిగా పుజిస్తారు. ఈ ఏడాది (2024) ఆగస్టు 9న నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. పంచమి తిది ఆగస్టు 9న ఉదయం 8:15 గంటలకు ప్రారంభమై మర్నాడు ఆగస్టు 10న ఉదయం 06:09 గంటలకు ముగుస్తుంది. కనుక ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం లేదా పితృదోషం ఉంటే నాగ పంచమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆ చర్యలు ఏమిటో తెలుసుకుందాం..

నాగ పంచమి రోజున పితృదోష నివారణకు చేయాల్సిన పరిహారాలు

  1. ఎవరి జాతకంలోనైనా కాల సర్ప దోషం లేదా పితృ దోషం ఉంటే అటువంటి వ్యక్తుల జీవితం సమస్యలతో చుట్టుముడుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నాగ పంచమి రోజున శ్రీ సర్ప సూక్తాన్ని పఠించాలి. ఇది మహా శక్తివంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది.
  2. నాగ పంచమి రోజున శ్రీమద్ భగవద్ పురాణం, శ్రీ హరివంశ పురాణాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఇలా చేయడం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.
  3. నాగ పంచమి రోజున శివునికి చందనాన్ని సమర్పించి దానిని నుదుటిపై తిలకంగా దిద్దుకోండి. అంతేకాదు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన పితృ దోషం తొలగిపోతుంది.
  4. నాగ పంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడ, లేదా మట్టితో సర్ప ఆకారాన్ని తయారు చేసి పూర్తి ఆచారాలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలతోపాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. నాగ పంచమి రోజున ఏదైనా శివాలయానికి లేదా ఇతర ఆలయానికి వెండితో చేసిన సర్పాన్ని దానం చేయడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఆర్థికం ఇబ్బంది తీరి లాభాల బాట పట్టే అవకాశం ఉంది.
  7. నాగ పంచమి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పచ్చి మట్టి దీపాలలో ఆవు పాలను ఉంచి.. నాగదేవత ను స్మరిస్తూ దేవాలయంలో లేదా ఇంటి మూలల్లో పెట్టండి.
  8. పితృదోషం నుండి బయటపడటానికి నాగ పంచమి రోజున నాగ దేవతను విగ్రహం లేదా చిత్రం రూపంలో పూజిస్తారు. ఈ రోజున పాములకు పాలతో అభిషేకం చేసి పూజిస్తారు. కొంతమంది పుట్టలో పాలు పోస్తారు.
  9. ఈ ఏడాది నాగ పంచమి రోజున శివ్వాస యోగం, సర్వార్థ సిద్ధి యోగం, కర్ణ యోగాలు హస్తా నక్షత్రంలో ఏర్పడనున్నాయి. నాగ పంచమి రోజున ఈ అరుదైన యాదృచ్ఛిక కాలాలు సర్ప దోషం, రాహువు కలిగించే చెడు ప్రభావాలను తగ్గించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. కనుక వీలైతే నాగేంద్రుడికి లేదా సుబ్రమణ్య స్వామిని పూజించి.. విశేష ఫలితాలను పొందండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు