Dream Astrology: కలలో తరచుగా సూర్యాస్తమయం కనిపిస్తుందా… స్వప్నశాస్త్ర ప్రకారం దీని అర్ధం ఏమిటో తెలుసా..!

పాములు, పర్వతాలు, రామచంద్రుడు, హనుమంతుడు, గుడ్లగూబ, ఎరుగుతున్న పక్షులు, ఇలా రకరకాల సన్నివేశాలు, వివిధ హిందూ దేవతలు కూడా కలలో కనిపిస్తాయి. ఈ వివిధ కలలకు వివిధ వివరణలు ఉన్నాయి. అలాగే నిద్రలో సూర్యాస్తమయం అవుతున్నట్లు లేదా సూర్యాస్తమం చిత్రం కలలో కనిపిస్తే.. దానికి అర్ధం ఏమిటి? స్వప్న శాస్త్రం ప్రకారం.. భవిష్యత్తులో ఆ కల ఏమి సూచిస్తుందో .. ఆ కలకు సంబంధించిన లక్షణలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Dream Astrology: కలలో తరచుగా సూర్యాస్తమయం కనిపిస్తుందా... స్వప్నశాస్త్ర ప్రకారం దీని అర్ధం ఏమిటో తెలుసా..!
SunsetImage Credit source: pexels
Follow us
Surya Kala

|

Updated on: Jul 12, 2024 | 7:58 AM

ప్రతి ఒక్కరూ నిద్ర పోయే సమయంలో కలలు కంటారు. ఇది సహజ ప్రక్రియ. కలలకు మానవ జీవితానికి లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుందని స్వప్న శాస్త్రం పేర్కొంది. కలలు భావోద్వేగాలు. రకరకాల సంఘటనల కలయికను కలిగి ఉంటాయి. కొన్ని రకాల కలలు తరచుగా వస్తూ.. మనసుని లోతైన గాయం చేస్తాయి. అదే సమయంలో కొన్ని కలలు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత చెదిరిపోతాయి. కొంచెం కూడా ఆ కల ఏమిటో గుర్తుకు రాదు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఒక్కో కలకి ఒక్కో అర్థం ఉంది. ప్రతి మనిషికి నిద్రలో కలలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే అసలు కలలు కనని వ్యక్తులు ఉండడం అనేది కష్టం. సప్న శాస్త్రం ప్రకారం కలల ప్రపంచం గురించి వివిధ సమాచారం అందించబడింది. కలలో జరిగిన సంఘటనలను ఇతరులతో చెప్పవద్దు అని పెద్దలు అంటారు. కనుక భయానక కలని చూసినప్పుడు దాని అర్థం ఏమిటి, సంతోషకరమైన కలని చూసినప్పుడు దాని అర్థం ఏమిటి? ఇలా వివిధ రకాల కలలకు అర్ధాలు స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు.

పాములు, పర్వతాలు, రామచంద్రుడు, హనుమంతుడు, గుడ్లగూబ, ఎరుగుతున్న పక్షులు, ఇలా రకరకాల సన్నివేశాలు, వివిధ హిందూ దేవతలు కూడా కలలో కనిపిస్తాయి. ఈ వివిధ కలలకు వివిధ వివరణలు ఉన్నాయి. అలాగే నిద్రలో సూర్యాస్తమయం అవుతున్నట్లు లేదా సూర్యాస్తమయం చిత్రం కలలో కనిపిస్తే.. దానికి అర్ధం ఏమిటి? స్వప్న శాస్త్రం ప్రకారం.. భవిష్యత్తులో ఆ కల ఏమి సూచిస్తుందో .. ఆ కలకు సంబంధించిన లక్షణలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

కలలో సూర్యాస్తమయాన్ని చూడటం

కలలో సూర్యాస్తమయాన్ని చూడటం స్వప్న శాస్త్రం ప్రకారం చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  కొన్ని సందర్భాల్లో ఇటువంటి కలలు ప్రతికూలంగా పరిగణింపబడుతున్నాయి. అయితే  అన్ని సమయంలో ఇటువంటి కల  అరిష్ట సంకేతం కాకపోవచ్చు. ఎందుకంటే సూర్యాస్తమయం ఒక రోజు ముగింపుని..  కొత్త రోజు ప్రారంభానికి సన్నాహకంగా పరిగణించబడుతుంది. కనుక ఇటువంటి కల పాత అధ్యాయం ముగిసిందని… ఇక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సూచిస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

సవాలుకు చిహ్నం

డ్రీమ్ సైన్స్ ప్రకారం సూర్యుడు కలలో అస్తమించినట్లయితే వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో చాలా సవాళ్లు ఎదురవుతాయని అర్థం. ఈ కల మంచి సమయాల ముగింపుకి.. పోరాటానికి నాందిగా పరిగణించబడుతుంది.

కొత్త వ్యాపారాన్ని ప్రారంభించండి

కలలో అస్తమించే సూర్యుడిని చూడటం మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇటువంటి కల రావడం అంటే మీరు భవిష్యత్తులో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అన్నదానికి ముందస్తు సూచన. ఈ కల మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు మళ్లిస్తుంది. అస్తమించే సూర్యుని కలలు కనడం కూడా అంతర్గత బలాన్ని సూచిస్తుంది.

శాంతికి ప్రతీక

డ్రీమ్ సైన్స్ ప్రకారం ఎవరైనా సూర్యాస్తమయం గురించి పదేపదే కలలుగన్నట్లు అయితే..  అది శాంతికి చిహ్నం. ఈ కల ద్వారా జీవితంలోని వివిధ సమస్యలు మీ జీవితం నుండి దూరం అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. జీవితంలో అపారమైన ఆనందం, శాంతి రాబోతున్నాయి.  జీవితం అంటే పని మాత్రమే కాదు, మీ కోసం కూడా కొంత కేటాయించాలని.. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని సూచన.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు