AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tholi Ekadashi: తొలి ఏకాదశి ఎప్పుడు? జూలై 16 లేదా 17న? ఈ రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..!

తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. చాతుర్మాసంలో ఎటువంటి శుభ కార్యాలని నిర్వహించరు. ఈ 4 నెలలలో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు. దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజుకి  జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది. జైనులకు కూడా  చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే  ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు. ఒకే చోట ఉండి దేవుడిని పూజిస్తారు.

Tholi Ekadashi: తొలి ఏకాదశి ఎప్పుడు? జూలై 16 లేదా 17న? ఈ రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..!
Tholi Ekadashi 2024
Surya Kala
|

Updated on: Jul 12, 2024 | 8:31 AM

Share

హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది. ప్రతి మాసంలోని కృష్ణ , శుక్ల పక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. అంతేకాదు శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది. ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢమాసంలోని ఏకాదశి రోజున  శ్రీ హరి యోగనిద్రకు వెళ్లాడని..  కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండగలు ప్రారంభం అవుతాయని విశ్వాసం.

తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. చాతుర్మాసంలో ఎటువంటి శుభ కార్యాలని నిర్వహించరు. ఈ 4 నెలలలో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు. దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజుకి  జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది. జైనులకు కూడా  చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే  ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు. ఒకే చోట ఉండి దేవుడిని పూజిస్తారు.

దేవశయని ఏకాదశి (తొలి  ఏకాదశి) 2024 ఎప్పుడంటే

హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16 వ తేదీ  మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉదయతిథి ప్రకారం.. ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి,  నియమ నిష్ఠలతో విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ హరి  అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు,  సిరి సంపదలు కలుగుతాయి.

దేవశయని ఏకాదశి రోజున ఏమి చేయాలంటే?

  1. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి.
  2. శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి.
  3. ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి.
  4. అంతే కాదు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి.
  5. శ్రీ హరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి.

దేవశయని ఏకాదశి నాడు ఏమి చేయకూడదంటే?

  1. దేవశయని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు
  2. అంతే కాకుండా ఈ రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు.
  3. ఏకాదశి రోజున స్త్రీలను, పెద్దలను అవమానించకండి.
  4. ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు
  5. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్లా చెడు ఆలోచనలు చేయకూడదు.

దేవశయని ఏకాదశి నియమాలు

  1. దేవశయని ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు.
  2. ఈ ఏకాదశి రోజున స్త్రీలు తల స్నానం చేయకూడదు.
  3. దేవశయని ఏకాదశి రోజున గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు.
  4. దేవశయని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు