AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Masam: శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు ధరించడం ఎందుకు శుభప్రదం? శాస్త్రీయ కోణం ఏమిటంటే?

ఆకుపచ్చ రంగుకి కూడా వివాహంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రంగు పవిత్రమైన బంధంతో ముడిపడి ఉంటుంది. ఎరుపు వలె ఆకుపచ్చ రంగు అదృష్టంగా పరిగణించబడుతుంది. సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితం,  భర్తల దీర్ఘాయువుని కోరుతూ శివుని ఆశీర్వాదం కోసం మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు,  బట్టలు ధరిస్తారు. ఈ రోజు శ్రావణ  మాసంలో మహిళలు పచ్చ గాజులు, ఆకు పచ్చ రంగు దుస్తులు  ధరించడానికి గల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

Shravana Masam: శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు ధరించడం ఎందుకు శుభప్రదం? శాస్త్రీయ కోణం ఏమిటంటే?
Shravana Masam 2024
Surya Kala
|

Updated on: Jul 12, 2024 | 7:41 AM

Share

తెలుగు నెలలలో ఐదవ నెల శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసానికి  హిందూ మతంలో  చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఈ నెల పండగలు, పర్వదినాలు, వ్రతాలు శుభకార్యాలకు  నెలవు. అంతేకాదు ఉత్తారాదివారు శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రావణ సోమవారాలు శివ పూజకు అంకితం అయితే శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీదేవి పూజకు, శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మీదేవి కి అంకితం. ఈ శ్రావణ మాసంలో మహిళలు గౌరీ దేవిని, వరలక్ష్మిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.  అయితే శ్రవణ మాసంలో ఎక్కడ చూసినా ఆకుపచ్చగానే కనిపిస్తుంది.  ఈ నెలలో ఎండల నుంచి ప్రకృతికి ఉపశమనం లభించి కురిసిన చినుకులతో చెట్లు చిగురిస్తాయి. పర్యావరణం పచ్చగా మారుతుంది. ఆకుపచ్చ రంగు అదృష్టానికి చిహ్నం. మహిళలు ఎక్కువగా శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు దుస్తులు, ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తారు.

ఆకుపచ్చ రంగుకి కూడా వివాహంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రంగు పవిత్రమైన బంధంతో ముడిపడి ఉంటుంది. ఎరుపు వలె ఆకుపచ్చ రంగు అదృష్టంగా పరిగణించబడుతుంది. సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితం,  భర్తల దీర్ఘాయువుని కోరుతూ శివుని ఆశీర్వాదం కోసం మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు,  బట్టలు ధరిస్తారు. ఈ రోజు శ్రావణ  మాసంలో మహిళలు పచ్చ గాజులు, ఆకు పచ్చ రంగు దుస్తులు  ధరించడానికి గల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

శ్రావణ మాసం 2024 ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?

ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగష్టు 5వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 3వ తేదీ  2024న ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగుకి గల ప్రాముఖ్యత

  1. ఈ నెలలో ప్రకృతికి దగ్గరగా ఉండే ఆకు పచ్చ రంగుకి మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. మహిళలు ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ బట్టలు ధరిస్తారు.
  2. ఇలా చేయడం శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
  3. హిందూ మతంలో ఆకుపచ్చ రంగుకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఆకుపచ్చ రంగు వివాహం, శుభకార్యాల్లో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
  4. ప్రకృతిని ఇష్టపడే ఆదిదంపతులైన శివ పార్వతుల ఆశీర్వాదాల కోసం మహిళలు ఎక్కువగా ఈ రంగుని ఇష్టపడతారు.
  5. దేవతలు కూడా ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని నమ్మకం. ముఖ్యంగా హరిహరులకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమని  విశ్వాసం. పూజ సమయంలో ఈ రంగు దుస్తులు ధరించడం వలన త్వరగా ప్రసన్నం అవుతారని ఓ నమ్మకం.

శాస్త్రీయ కోణంలో ఈ రంగు ధరించడానికి గల ప్రాముఖ్యత

ఎరుపు రంగు  శౌర్యానికి, అదృష్టానికి చిహ్నం అయితే ఆకుపచ్చ రంగు ప్రకృతికి, పాజిటివ్ దృక్వధానికి, అదృష్టానికి చిహ్నంగా హిందువులు భావిస్తారు. అంతేకాదు శాస్త్రీయ కోణంలో కలర్ థెరపీ (క్రోమోథెరపీ) ప్రకారం ఆకుపచ్చకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రోమాథెరపిస్టుల ప్రకారం.. ప్రకృతిలోని ప్రశాంతను చూచించే ఆకు పచ్చ రంగు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పిత్త స్వభావం ఉన్న వ్యక్తులు ఆకుపచ్చ రంగు మంచి రిలీఫ్ ని ఇస్తుంది.   కాలేయంలో శక్తి ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఆయుర్వేదంలో ఆకుపచ్చ రంగుకి విశిష్ట స్థానం ఉంది. ఈ రంగు  వైద్యం, శ్రేయస్సుతో ముడిపడి ఉంది.  ఆకుపచ్చ ప్రకృతి రంగు.  వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండే వ్యక్తి త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఆకుపచ్చ రంగు వైద్యం చేసే గుణాలు కలిగి ఉందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు