Kamakhya Temple: ఈ శక్తి పీఠంలో అన్నీ రహస్యాలే.. అసంపూర్తిగా కామాఖ్య ఆలయం మెట్లు.. నేటికీ ఎందుకు పూర్తి చేయలేదంటే

ప్రసిద్ధ కామాఖ్య ఆలయంలో అంబుబాచి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో భక్తులే కాదు సుదూర ప్రాంతాల నుంచి తాంత్రికులు, సాధువులు కూడా వస్తారు. రహస్యం, అద్భుతం, విశ్వాసాలకు కేంద్రమైన ఈ ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చే ఆలయ మెట్లు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఈ మెట్లు నేటికీ ఎందుకు పూర్తి కాలేదు. ఈ మెట్ల విషయంలో అనేక పురాణ కథలున్నాయి. 

Kamakhya Temple: ఈ శక్తి పీఠంలో అన్నీ రహస్యాలే.. అసంపూర్తిగా కామాఖ్య ఆలయం మెట్లు.. నేటికీ ఎందుకు పూర్తి చేయలేదంటే
Kamakhya Temple
Follow us

|

Updated on: Jul 10, 2024 | 3:39 PM

సతీదేవి శక్తిపీఠాల్లో అనేక పురాణ కథలు, రహస్యాలు ముడిపడి ఉన్నాయి. అలంటి శక్తి పీఠాలలో ఒకటి అస్సాం రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ కామాఖ్య ఆలయం. ఈ ఆలయం అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ అమ్మవారి యోనిని పూజిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అంబుబాచి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో భక్తులే కాదు సుదూర ప్రాంతాల నుంచి తాంత్రికులు, సాధువులు కూడా వస్తారు. రహస్యం, అద్భుతం, విశ్వాసాలకు కేంద్రమైన ఈ ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చే ఆలయ మెట్లు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఈ మెట్లు నేటికీ ఎందుకు పూర్తి కాలేదు. ఈ మెట్ల విషయంలో అనేక పురాణ కథలున్నాయి.

ఆలయ నిర్మాణ కథ

కామాఖ్య ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఒక కథనం ప్రకారం.. సతీదేవి దహనం తర్వాత శివుడు తపస్సు చేస్తూ సమాధిలోకి వెళ్లాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అనేక శక్తులను పొంది ఆ శక్తుల సహాయంతో మూడు లోకాలలోనూ భీభత్సం సృష్టించాడు. తారకాసురుని భీభత్సంతో కలత చెందిన దేవతలందరూ బ్రహ్మదేవుడిని శరణ కోరారు. తారకాసురుడు అంతం గురించి అడిగినప్పుడు శివుని కుమారుడు మాత్రమే చంపగలడని బ్రహ్మ దేవుడు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

కామదేవుడు శివుని సమాధిని భగ్నం చేశాడు శివుని తపస్సు భగ్నం చేయమని మన్మధుడిని పిలిచారు. శివుని తపస్సు భగ్నం చేయడానికి కామదేవుడు తన బాణాలను సంధించాడు. ఆ తర్వాత మహాదేవుడు కళ్ళు తెరిచిన వెంటనే కోపంతో కామదేవుడిని భస్మం చేశాడు. తన భర్త భస్మం కావడంతో మన్మధుడి భార్య రతి చాలా బాధపడి.. తన భర్తను బ్రతికించమని శివుడిని ప్రార్థించింది. శివుడు రతీ ప్రార్థనను అంగీకరించి.. కామదేవుడిని బ్రతికించాడు.. అయితే అతని రూపం, శక్తులు అదృశ్యమయ్యాయి.

తల్లి కామాఖ్య రక్షించింది

అందం, శక్తులను కోల్పోయిన మన్మధుడు చాలా విచారంగా ఉన్నాడు. తనను మునుపటిలా చేయమని శివుడిని ప్రార్థించాడు. సతీదేవి జననాంగాలు నీలాంచల్ పర్వతంపై ఉన్నాయని, అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తే తిరిగి నీ అందం వస్తుందని శివుడు మన్మధుడికి చెప్పాడు. అప్పుడు మన్మధుడు అమ్మవారి కోసం ఆలయాన్ని నిర్మించమని వాస్తుశిల్పి విశ్వకర్మను పిలిచాడు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత మన్మధుడు తిరిగి తన రూపాన్ని , శక్తిని పొందాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని కామ్రూప్ గా ప్రసిద్దిగాంచింది.

అసంపూర్తిగా ఉన్న ఆలయ మెట్లు

కామాఖ్య దేవాలయం దగ్గర అసంపూర్తిగా మెట్లు ఉన్నాయి. దీని గురించి ఒక ప్రసిద్ధ కథనం ఉంది. ఈ పురాణాల ప్రకారం తల్లి కామాఖ్య సౌందర్యాన్ని చూసి నరకాసురుడు అనే రాక్షసుడు ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. తనను పెళ్లి చేసుకోమని కామాఖ్యకు వివాహం ప్రతిపాదించాడు.. అప్పుడు దేవత నరకాసురుడిని వదిలించుకోవడానికి ఒక షరతు విధించింది. నరకాసురుడు ఒకే రాత్రిలో నీలాంచల్ పర్వతం నుండి గుడికి మెట్లు కట్టగలిగితే.. అతనిని వివాహం చేసుకుంటానని శరత్తు పెట్టిందట. నరకాసురుడు అమ్మవారి షరతును అంగీకరించి మెట్లు నిర్మించడం ప్రారంభించాడు.

నరకాసురుడు పని చేయడం చూసి తల్లి కామాఖ్య అతను ఈ పనిని పూర్తి చేయగలడని భావించి.. కాకిని కోడిగా మార్చి, తెల్లవారకముందే కూయమని కోరింది. కోడి కూతను విన్న నరకాసురుడు తెల్లవారి పోయిందని భావించి తాను పందెం ఓడిపోయానని అనుకున్నాడు. మెట్ల నిర్మాణం నిలిపివేశాడు. అయితే అసలు నిజం తెలిసిన తర్వత తాను మోసపోయినట్లు భావించి కోపంతో కోడిగా కూసిన కాకిని అక్కడే హతమార్చాడు. కోడిని బలి ఇచ్చిన ప్రదేశాన్ని కుకుర్కట అంటారు. తర్వాత కృష్ణుడు అవతారంలో శ్రీ మహా విష్ణువు నరకాసురుడిని సంహరించాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు