Lord Hanuman: అష్ట సిద్ధులను హనుమంతుడికి వరంగా ఇచ్చింది ఎవరు? అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలుసా..!

హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి జీవితంలో భయం ఉండదని.. బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ విషయం గోస్వామి తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో చెప్పబడింది. అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా । అస వర దీన్హ జానకీ మాతా అనే ద్విపదలో చెప్పబడిన సిద్ధులు చాలా అద్భుత శక్తులు.ఈ ఎనిమిది సిద్ధులు హనుమాన్ జీకి వరంలా ఇవ్వబడ్డాయి.

Lord HanumanImage Credit source: Bhaskar
Follow us

|

Updated on: Jul 10, 2024 | 4:00 PM

హిందువులు పూజించే దేవి దేవతలలో హనుమంతుడికి మాత్రమే అష్ట సిద్ధి యోగాలున్నాయి. ఆయన్ని నవ నిధి దాతగా పిలువబడుతున్నాడు. అంటే హనుమంతుడు మొత్తం అష్ట సిద్ధి, నవ నిధిని పొందాడు. ప్రాచీన కాలం నుండి హిందూ మతంలో సిద్ధిలకు, దైవిక జ్ఞానానికి విశేష ప్రాధాన్యత ఇవ్వబడింది. సిద్ధి అనే పదానికి పరిపూర్ణతను సాధించడం అని అర్థం. అయితే హనుమంతుడు ఈ అష్ట సిద్ధులను వరంగా ఎవరి నుండి పొందాడో తెలుసా?

ఇందుకు సంబంధించిన వివరణ హనుమాన్ చాలీసాలో

హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి జీవితంలో భయం ఉండదని.. బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ విషయం గోస్వామి తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో చెప్పబడింది. అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా । అస వర దీన్హ జానకీ మాతా అనే ద్విపదలో చెప్పబడిన సిద్ధులు చాలా అద్భుత శక్తులు.ఈ ఎనిమిది సిద్ధులు హనుమాన్ జీకి వరంలా ఇవ్వబడ్డాయి.

ఎవరి నుంచి ఈ సిద్ధులను వరంగా పొందాడంటే

శ్రీ రాముడి భక్తుడైన హనుమంతుడు .. జానకి దేవి చే అష్ఠసిద్ధి నవ నిధులను వరంగా పొందాడు. ఈ సిద్ధులను నిర్వహించగల శక్తి హనుమంతుడికి మాత్రమే ఉందని చెబుతారు. ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు. ఈ తొమ్మిది సంపదలు పొందిన తర్వాత ఎలాంటి ధనం, ఆస్తి అవసరం ఉండదని విశ్వాసం. హనుమంతునికి ఎనిమిది రకాల విజయాలు ఉన్నాయి. వారి ప్రభావంతో అతను ఏ వ్యక్తి రూపాన్ని పొందగలడు. శరీరం చాలా చిన్నదిగా చేయగలడు అదే సమయంలో శరీరం కొండలా చాలా భారీగా పెంచనుగలడు. తన బుద్ధి బలంతో క్షణాల్లో ఎక్కడికైనా చేరుకోగలడు. వీటిని అష్ట సిద్ధులు అని అంటారు.

ఇవి కూడా చదవండి

హనుమంతుడు వరంగా పొందిగా అష్ట సిద్దులు ఏమిటంటే

  1. అణిమా: ఈ సిద్ధి కారణంగా హనుమంతుడు తన శరీరాన్ని ఎప్పుడైనా చిన్నదిగా అంటే చాలా సూక్ష్మమైన రూపాన్ని ధరించగలడు.
  2. మహిమ: ఈ సిద్ధితో హనుమంతుడు తన శరీరాన్ని కావలసినంత మేర విస్తరించగలదు. భారీ రూపాన్ని పొందగలడు.
  3. గరిమ : ఈ సిద్ధితో హనుమంతుడు తన బరువుని పెంచుకోలడు. ఎవరు తనని ఎత్తని విధంగా బరువును భారీ పర్వతంలా మార్చుకోగలడు
  4. లఘిమ: ఈ సిద్ధి శక్తితో గరిమకు వ్యతిరకం. హనుమంతుడు తన శరీర బరువుని పూర్తిగా తగ్గించుకోగలడు. క్షణంలో ఎక్కడికైనా వెళ్ళగలడు.
  5. ప్రాప్తి : ఈ సిద్ధి ద్వారా ఏమి కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుంచి కూడా సృజించుకోగలరు
  6. ప్రాకామ్య: ఈ సిద్ధి సహాయంతో, హనుమంతుడు భూమి లోతు నుండి పాతాళానికి వెళ్ళగలడు. ఆకాశంలో ఎగరగలడు.. కోరుకున్నంత కాలం నీటిలో జీవించగలడు..ఎంత కాలమైనా యవ్వనంగా ఉండగలడు. ఇంకా చెప్పలంటే అనేక దివ్య శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణము , ఆకాశ గమనము) హనుమంతుడి వశంలో ఉన్నాయి.
  7. ఈశత్వం: ఈ సిద్ధి సహాయంతో హనుమంతుడు ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం కలిగి ఉన్నాడు. ఈ సిద్ధి సాయంతోనే వానర సైన్యాన్ని నైపుణ్యంగా నడిపించాడు.
  8. వశిత్వం: ఈ సిద్ధి వల్ల హనుమంతుడు జితేంద్రియుడు. మనస్సుపై నియంత్రణ కలిగి ఉంటాడు. ఈ ప్రభావం కారణంగా హనుమంతుడు సకల జీవరాశులు తాను చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి కలిగి ఉన్నాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం