AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: బద్రీనాథ్ హైవే పై విరిగి పడిన భారీ కొండచరియలు.. ప్రాణాల కోసం ప్రజలు పరుగులు.. వీడియో వైరల్

గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండలపై కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్‌కు వెళ్లే హైవే అనేక ప్రదేశాల్లో శిథిలాల కారణంగా మూసుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ సంఖ్యలో రోడ్లు మూసుకుపోయాయి. చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు భారీగా జలమయమయ్యాయి.

Uttarakhand: బద్రీనాథ్ హైవే పై విరిగి పడిన భారీ కొండచరియలు.. ప్రాణాల కోసం ప్రజలు పరుగులు.. వీడియో వైరల్
Landslide On Badrinath
Surya Kala
|

Updated on: Jul 10, 2024 | 3:12 PM

Share

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై (బుధవారం) ఈ రోజు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 30 సెకన్ల నిడివి గల వీడియోలో జోషిమఠంలోని చుంగిధార్ వద్ద కొండ పెద్ద భాగం శిథిలమై రోడ్డుపై పడిపోవడం, పెద్ద రాళ్లు మార్గాన్ని అడ్డుకోవడం చూపిస్తుంది.

ఇలా కొండ చరియలు విరిగి పడడంతో ప్రజలు భయాందోళనలతో కేకలు వేయడం, తమ భద్రత కోసం పరిగెత్తడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అదే సమయంలో చాలా మంది తమ ఫోన్‌లలో కొండ చరియలు విరిగిపడుతుండగా బంధించడం కూడా కనిపించింది.

ఇవి కూడా చదవండి

కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది మంది ప్రజలు, వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో అధికారులు బద్రీనాథ్ హైవేని బ్లాక్ చేసి శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాలను తొలగించి రహదారిని తెరవడం కోసం రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు చర్యలు చేపట్టారు. అర్థరాత్రికి రహదారి తెరవబడుతుందని తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండలపై కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్‌కు వెళ్లే హైవే అనేక ప్రదేశాల్లో శిథిలాల కారణంగా మూసుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ సంఖ్యలో రోడ్లు మూసుకుపోయాయి. చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు భారీగా జలమయమయ్యాయి.

చమోలిలో రెండు చోట్ల శిథిలాలు పడిపోవడం, పేరుకుపోవడంతో శుక్రవారం కూడా బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. రద్దీగా ఉండే భానర్‌పాని-పిపల్‌కోటి నాగ పంచాయతీ రహదారి, అంగ్థాలా రహదారిపై అంతరాయం ఏర్పడింది, చాలా మంది ప్రయాణికులు, స్థానికులు చిక్కుకుపోయారని వార్తా సంస్థ ANI వెల్లడించింది.

శనివారం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి వారి మృతదేహాలను బయటకు తీశారు.

ఇదిలావుండగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో ఒకరోజు పాటు నిలిపివేసిన చార్ ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. కొండచరియలు విరిగిపడటంతో రుద్రప్రయాగ్-కేదార్‌నాథ్ జాతీయ రహదారి కూడా మూసుకుపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..