Excise policy case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌ ఈడీ చార్జ్‌షీట్‌లో సంచలనాలు.. కింగ్ పిన్, కుట్రదారు అతడే..!

ఢిల్లీ లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలపై రూస్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఈడీ చార్జ్ షీట్‌లో నిందితులుగా చేసింది.

Excise policy case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌ ఈడీ చార్జ్‌షీట్‌లో సంచలనాలు.. కింగ్ పిన్, కుట్రదారు అతడే..!
Arvind Kejriwal
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 10, 2024 | 4:20 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలపై రూస్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఈడీ చార్జ్ షీట్‌లో నిందితులుగా చేసింది. ఈ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌ను కింగ్‌పిన్‌గా, కుట్రదారుడిగా ఈడీ అభివర్ణించింది. ఇదొక్కటే కాదు, గోవా ఎన్నికల్లో లంచం సొమ్మును వినియోగించినట్లు తమకు తెలిసిందని ఈడీ పేర్కొంది.

అరవింద్ కేజ్రీవాల్, నిందితుడు వినోద్ చౌహాన్ మధ్య వాట్సాప్ చాటింగ్ వివరాలను చార్జ్ షీట్‌లో చేర్చారు ఈడీ అధికారులు. గోవా ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీఏ వినోద్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.25.5 కోట్లు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌తో వినోద్‌ చౌహాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయని చాట్‌లో తేలిందని ఈడీ పేర్కొంది.

మంగళవారం, కోర్టు ఈడీ ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకుంది. జూలై 12న కోర్టు ముందు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు సమన్లు ​​పంపింది. మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. జూలై 12న కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగా హాజరుపరచాలని కోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.

ఛార్జ్ షీట్‌లో ఈడీ క్రైమ్ ప్రొసీడ్‌ను కూడా ప్రస్తావించింది. నిందితుడు వినోద్ చౌహాన్ మొబైల్ నుండి హవాలా నోట్ నంబర్ అనేక స్క్రీన్ షాట్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. వీటిని గతంలో ఆదాయపు పన్ను కూడా స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ నుంచి గోవాకు హవాలా ద్వారా వినోద్ చౌహాన్ అక్రమ సొమ్మును ఎలా బదిలీ చేస్తున్నాడో ఈ స్క్రీన్ షాట్లు కోర్టు ముందు ఉంచింది ఈడీ. ఈ డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో ఉపయోగించినట్లు, హవాలా ద్వారా గోవాకు చేరిన డబ్బును అక్కడే ఉన్న చన్‌ప్రీత్ సింగ్ మేనేజ్ చేసినట్లు ఈ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌కు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను జూలై 15న విచారణకు ఢిల్లీ హైకోర్టు జాబితా చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు జూన్ 20న ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు గతంలో స్టే విధించింది. ఈ పిటిషన్‌ను విచారించాల్సిన జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ, మంగళవారం రాత్రి 11 గంటలకు కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం కాపీని దర్యాప్తు సంస్థకు అందింది. ఈడీ తన సమాధానం దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ఈడీ తరపు న్యాయవాది తెలియజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..