AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram love: సోషల్ మీడియా పరిచయాలు తెస్తున్న తంటా.. ఇన్‌స్టా ప్రియుడికి పెళ్లైందని తెలిసి యువతి ఆత్మహత్య..

సోషల్ మీడియా ద్వారా జరిగే పరిచయాలు గురించి జాగ్రత్త అని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ కు పెళ్లి జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. అంతేకాదు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాల గురించి తెలిస్తే మనిషి పయనం ఎటువైపు అనిపిస్తుంది ఎవరికైనా.. తమిళనాడు తేనాంపేటలోని ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన 22 ఏళ్ల యువతి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాయ్‌ఫ్రెండ్‌ పెళ్లాడాడని తెలియడంతో ప్రాణాలను తీసుకుంది.

Instagram love: సోషల్ మీడియా పరిచయాలు తెస్తున్న తంటా.. ఇన్‌స్టా ప్రియుడికి పెళ్లైందని తెలిసి యువతి ఆత్మహత్య..
Instagram Love
Surya Kala
|

Updated on: Jul 10, 2024 | 4:30 PM

Share

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ , రాకరకాల సోషల్ మీడియాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం అరచేతిలో దర్శనం ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కడెక్కడి మనుషులకు పరిచయం చేసి ఒక్కటి చేస్తుంది. అదే సమయంలో తమ కుటుంబ సభ్యుల మధ్య దూరం పెంచుతుంది అని అంటారు. అయితే సోషల్ మీడియా ద్వారా జరిగే పరిచయాలు గురించి జాగ్రత్త అని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ కు పెళ్లి జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. అంతేకాదు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాల గురించి తెలిస్తే మనిషి పయనం ఎటువైపు అనిపిస్తుంది ఎవరికైనా..

తమిళనాడు తేనాంపేటలోని ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన 22 ఏళ్ల యువతి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాయ్‌ఫ్రెండ్‌ పెళ్లాడాడని తెలియడంతో ప్రాణాలను తీసుకుంది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు మృతురాలు ఎస్ అనిత కెకె నగర్‌లోని ఓ ఆయిల్ స్టోర్‌లో ఉద్యోగం చేస్తుందని తెలిపారు. సోమవారం అనిత సోదరుడు అజిత్ భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆమె తల్లి S పార్వతి (47) పనిలో ఉంది. దీంతో అనితను అన్నం పెట్టమని పలుమార్లు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలోంచి చూడగా శవమై కనిపించింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు పగులగొట్టి అనిత మృతదేహాన్ని వెలికితీశారు. సైదాపేట సమీపంలోని చిన్నమలైకి చెందిన ఆకాష్‌ అనే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్నేహం ఏర్పడిందని.. తర్వాత ఆకాష్ ని అనిత ప్రేమించినట్లు విచారణలో తేలింది. ఆకాష్‌కి పెళ్లయిందని తెలుసుకున్న అనిత ప్రాణాలు తీసుకుంది. పార్వతి ఫిర్యాదు మేరకు ఎంజీఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది ఇలా ఉంటే మరో ఘటనలో తేనాంపేటలో ఓ మహిళ తన ప్రేమ ప్రతిపాదనను అంగీకరించకపోతే యాసిడ్ పోస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. 20 ఏళ్ల యువతికి నాలుగేళ్ల క్రితం ఎస్‌ఎం నగర్‌కు చెందిన లోకేష్‌తో స్నేహం ఏర్పడింది. అయితే గత కొన్ని నెలలుగా యువతి లోకేష్ తో మాట్లాడటం మానేసింది. దీంతో సోమవారం రోజున లోకేష్ తన ప్రేమను అంగీకరించాలని ఆ యువతిని అడిగాడు. తన ప్రేమకు ఒకే చెప్పక పొతే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి తేనంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…