Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో ఆస్ట్రియాతో భారత్ వ్యూహాత్మక సహకారం.. ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్‌తో ప్రధాని మోదీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (జూలై 10) తన మొదటి పర్యటన సందర్భంగా ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో యుద్ధం భారతదేశం-ఆస్ట్రియా వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చించారు.

ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో ఆస్ట్రియాతో భారత్ వ్యూహాత్మక సహకారం.. ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్‌తో ప్రధాని మోదీ భేటీ
Pm Modi Austria Visit
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 10, 2024 | 6:25 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (జూలై 10) తన మొదటి పర్యటన సందర్భంగా ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో యుద్ధం భారతదేశం-ఆస్ట్రియా వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చించారు. మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్త మీడియా సమావేశంలో ప్రపంచంలో యుద్ధానికి చోటు లేదని పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియా పర్యటన చారిత్రాత్మకం, ప్రత్యేకమైనదని అభివర్ణించారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, నీరు మరియు వ్యర్థాల నిర్వహణ, AIపై ఆస్ట్రియాతో సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. ఇది యుద్ధానికి సమయం కాదని, ఇంతకుముందు కూడా చెప్పాను, యుద్ధభూమిలో సమస్యలను పరిష్కరించలేమని, మానవత్వంపై నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు బాధపడతారు, ప్రాణనష్టం ఆమోదయోగ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

భారత్, ఆస్ట్రియా కలిసి తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇరు దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలోనైనా ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన వంటి విలువలపై భారత్-ఆస్ట్రియా దేశాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. ప్రధానమంత్రిగా మూడవ సారి బాధ్యతలు స్వీకరించిన ప్రారంభంలో ఆస్ట్రియాను సందర్శించే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నానని మోదీ తెలిపారు

కాగా, ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ సోషల్ మీడియా X లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ లేవనెత్తిన అనేక అంశాలకు అంగీకరించారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన శాంతి సదస్సులో తీసుకున్న మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పశ్చిమ, దక్షిణాది దేశాలు ఏకం కావాలని, ఈ విషయంలో భారత్‌కు కూడా ముఖ్యమైన పాత్ర ఉందన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఇప్పుడే ముగియాలి. దీని కోసం, ఆస్ట్రియా అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..