Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రైల్వే ఫ్లాట్ ఫాంపై రీల్స్‌ చేస్తూ యువతి పిచ్చిచేష్టలు.. ఒళ్లు మండి చితక్కొట్టిన మహిళ! వీడియో

ఓ రైల్వే ప్లాట్‌ఫాం ప్రయాణికులతో రద్దీగా ఉంది. అయితే ఎక్కడి నుంచి వచ్చిపడిందో తెలియదు గానీ ఓ యువతి పిచ్చిపట్టిన దానిలా ప్లాట్‌ఫాంపై కుప్పిగంతులు వేయడం ప్రారంభించింది. అంతేనా.. చూసుకోకుండా ఓ మహిళా ప్రయాణికురాలిపై పడింది. కింద పడింది లేచి.. సారీ చెబితే బాగుండేది. కానీ సదరు యవతి మాత్రం లేవకుండా అలాగే నేలపై వాలి అదో రకమైన డ్యాన్స్‌ మూమెంట్లు చేయసాగింది. దీంతో ఒళ్లు మండిన సదరు..

Viral Video: రైల్వే ఫ్లాట్ ఫాంపై రీల్స్‌ చేస్తూ యువతి పిచ్చిచేష్టలు.. ఒళ్లు మండి చితక్కొట్టిన మహిళ! వీడియో
Instagram Influencer Sema Video
Srilakshmi C
|

Updated on: Jul 10, 2024 | 1:32 PM

Share

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని యువత పడరాని పాట్లు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ పిచ్చిపట్టిన వారిలా రీల్స్ తీసుకుంటూ వెకిలీ వేషాలు వేస్తూ ఉంటారు. అయితే వీరి ప్రవర్తన చుట్టూ ఉండే వారికి ఇబ్బంది కలిగించనంత వరకూ బాగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఇలాంటి యవ్వారాలు బెడిసి కొడుతుంటాయి. అందరినీ నవ్వించడానికి హాస్యాస్పదమైన పనులు చేస్తూ.. చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది.

ఓ రైల్వే ప్లాట్‌ఫాం ప్రయాణికులతో రద్దీగా ఉంది. అయితే ఎక్కడి నుంచి వచ్చిపడిందో తెలియదు గానీ ఓ యువతి పిచ్చిపట్టిన దానిలా ప్లాట్‌ఫాంపై కుప్పిగంతులు వేయడం ప్రారంభించింది. అంతేనా.. చూసుకోకుండా ఓ మహిళా ప్రయాణికురాలిపై పడింది. కింద పడింది లేచి.. సారీ చెబితే బాగుండేది. కానీ సదరు యవతి మాత్రం లేవకుండా అలాగే నేలపై వాలి అదో రకమైన డ్యాన్స్‌ మూమెంట్లు చేయసాగింది. దీంతో ఒళ్లు మండిన సదరు ప్రయాణికురాలు యువతిని పట్టుకుని చితక్కొంట్టింది. అయితే యువతి మాత్రం తనకేం పట్టనట్లు ఆమె కొడుతున్నా సరే.. డ్యాన్స్‌ చేస్తూనే ఉంది. ఇదంతా చూస్తున్న.. ఇతర ప్రయాణికులు నిజంగా ఆమె డ్యాన్స్‌ చేస్తుందా.. లేదంటే డ్రగ్స్‌ ఏమైనా తీసుకుని ఎగురుతుందా? అనే డౌట్‌తో.. ఎందుకైనా మంచిది కాస్త డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేద్దాం అని దూరదూరంగా వెళ్లిపోసాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసి నెటిజన్లు సదరు పిచ్చి యువతి ఎవరో కనిపెట్టేశారు. ఆమె పేరు సీమా అట. సీమా ముంబైలోని రైల్వే స్టేషన్‌లో తరచూ ఇలా రీల్స్‌ చేస్తూ ఉంటుందట. బహిరంగ ప్రదేశాల్లో ఇలా హాస్యాస్పదంగా డ్యాన్స్ చేసి ఇంటర్నెట్‌లో ఫేమస్ అవ్వడమే ఆమె ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వీడియోలను Instagramలో @seemakanojiya87 అనే యూజర్‌ ఐడీతో ఉన్న ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది కూడా.

ఇక ఈ వీడియోలు చూసిన పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీల్స్‌తో లైకులు, వ్యూస్‌ తెచ్చుకోవడానికి రైల్వే ప్లాట్‌ ఫాంపై ఇంత దారుణంగా డ్యాన్స్‌ చేయడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. రీల్స్ మోజులోపడి చదువుసంథ్యలు మానేసి యువత ఇలా పెడదోవ పడుతుందంటూ ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్‌ మీరు మాత్రం మీ బంగారు భవిష్యత్తులు ఇలా వృథా చేసుకోకండే..

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.