Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Human Labour Traffic in US: అమెరికాలో ఉద్యోగాల పేరిట అమానవీయం.. నలుగురు తెలుగోళ్లు అరెస్టు!

అమెరికాలో నలుగురు తెలుగు వాల్లను పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్సాస్‌లో మానవ అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలు ప్రారంభించి బలవంతంగా 100 మందికిపైగా వర్కర్లతో పనిచేయిస్తున్నట్లు విచారణలో తేలింది. బాధితుల్లో సగానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. అరెస్టైన నలుగురూ తెలంగాణలోని నల్లగొండ జిల్లా కనగల్‌ మండలానికి చెందిన..

Human Labour Traffic in US: అమెరికాలో ఉద్యోగాల పేరిట అమానవీయం.. నలుగురు తెలుగోళ్లు అరెస్టు!
Human Labour Traffic In US
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 10, 2024 | 8:41 AM

వాషింగ్టన్‌, జులై 10: అమెరికాలో నలుగురు తెలుగు వాల్లను పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్సాస్‌లో మానవ అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలు ప్రారంభించి బలవంతంగా 100 మందికిపైగా వర్కర్లతో పనిచేయిస్తున్నట్లు విచారణలో తేలింది. బాధితుల్లో సగానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. అరెస్టైన నలుగురూ తెలంగాణలోని నల్లగొండ జిల్లా కనగల్‌ మండలానికి చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు జరపగా ఈ విషయం వెల్లడైందని ప్రిన్స్‌టన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు వెల్లడించారు.

యూఎస్‌లోని టెక్సాస్‌లో గిన్స్‌బర్గ్‌ లేన్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పదంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు అక్కడి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ ఏడాది మార్చి 13న సీఐడీ విభాగం సంతోష్‌ కట్కూరి ఇంట్లో సోదాలు జరపగా.. అక్కడ 15 మంది యువతులతో బలవంతంగా పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో ఓ మహిళతో సహా నలుగురు భారతీయ అమెరికన్లపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీలో 15 మంది మహిళలను బాధితులుగా గుర్తించారు. అరెస్టైన వారిని చందన్‌ దాసిరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్‌ కట్కూరి, అనిల్‌ మాలేనుగా గుర్తించారు. వీరిని ఈ ఏడాది మార్చిలోనే అరెస్టు చేశారు.

వీరిలో సంతోష్‌ కట్కూరి, అతడి భార్య ద్వారకా గుండాకు చెందిన పలు షెల్‌ కంపెనీలలో బాధితులతో బలవంతంగా పనిచేయిస్తున్నారు. ప్రిన్స్‌టన్‌లోని కొలిన్‌ కౌంటీ సమీపాన గిన్స్‌బర్గ్‌ లేన్‌లోని సంతోష్‌ ఇంటిలో 15 మంది యువతులు నేలపై పడుకుని అధికారులకు కనిపించారు. ఆ ఇంట్లోలోని ఒక గదిలో ఏవిధమైన ఫర్నిచర్‌ లేకుండా కేవలం కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రాకిక్‌ పరికరాలు, దుప్పట్లు, పెద్ద సంఖ్యలో సూట్‌ కేస్‌లు ఉన్నట్లు గమనించి ఓ పెస్ట్‌ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల దర్యాప్తులో ప్రిన్స్‌టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. డాలస్‌ కేంద్రంగా భారత ఓ ఏజెన్సీకి చెందిన నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని బాధితులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.