Worlds Most Expensive Burger: ఈ బర్గర్‌ ధరతో ఓ కారే కొనేయొచ్చు! తిట్టిపోస్తున్న నెటిజన్లు.. వీడియో

ఈ స్పెషల్‌ బర్గర్‌ పేరు 'గోల్డెన్‌ బాయ్‌'. ప్రముఖ చెఫ్‌ రాబర్ట్ జాన్‌ డి వెన్‌ దీనిని తయారు చేశాడు. దీని తయారీకి విలాసవంతమైన పదార్ధాలను వినియోగించడం వల్ల ఈ బర్గర్‌కు అమితమైన రుచి అబ్బినట్లు చెఫ్‌ రాబర్ట్ జాన్‌ అంటున్నాడు. కేవియర్. రసవంతమైన కింగ్ క్రాబ్ లేయర్లతో దీనిని తయారు చేశాడు. అలాగే అత్యంత ఖరీదైన వాగ్యు గొడ్డు మాంసం కూడా దీని తయారీలో వినియోగించాడట. మీద.. కిద పెట్టిన బన్ను ముక్కలు, దానితో పాటు ఉన్న ఉల్లిపాయ రింగులు కూడా..

Worlds Most Expensive Burger: ఈ బర్గర్‌ ధరతో ఓ కారే కొనేయొచ్చు! తిట్టిపోస్తున్న నెటిజన్లు.. వీడియో
World's Most Expensive Burger
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 10, 2024 | 12:00 PM

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల పాక కళలు ఉన్నాయి. భోజన ప్రియులు ఏ మాత్రం వీలు దొరికినా ఆయా చోట్లకు వెళ్లి నచ్చిన వంటకాలను రుచి చేసేందుకు అమితాశాసక్తి కనబరుస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తయారు చేసిన బర్డర్‌ యావత్‌ ప్రపంచాన్ని అమితంగా ఆకర్షిస్తోంది. కానీ ధర మాత్రం కాస్త ఎక్కువే. ఐతేనేం రుచిగల భోజనాన్ని ఆరగించేందుకు కస్టమర్లు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు. ఈ స్పెషల్ బర్గర్‌ తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్‌గా ఒక్కసారిగా దీనిపేరు మారుమోగిపోయింది.

ఈ స్పెషల్‌ బర్గర్‌ పేరు ‘గోల్డెన్‌ బాయ్‌’. ప్రముఖ చెఫ్‌ రాబర్ట్ జాన్‌ డి వెన్‌ దీనిని తయారు చేశాడు. దీని తయారీకి విలాసవంతమైన పదార్ధాలను వినియోగించడం వల్ల ఈ బర్గర్‌కు అమితమైన రుచి అబ్బినట్లు చెఫ్‌ రాబర్ట్ జాన్‌ అంటున్నాడు. కేవియర్. రసవంతమైన కింగ్ క్రాబ్ లేయర్లతో దీనిని తయారు చేశాడు. అలాగే అత్యంత ఖరీదైన వాగ్యు గొడ్డు మాంసం కూడా దీని తయారీలో వినియోగించాడట. మీద.. కిద పెట్టిన బన్ను ముక్కలు, దానితో పాటు ఉన్న ఉల్లిపాయ రింగులు కూడా చాలా స్పెషల్ అట. డోమ్ పెరిగ్నాన్-ఇన్ఫ్యూజ్డ్ షాంపైన్ నుంచి వీటిని సేకరించారట. ఇక చివరిగా బన్నుపై పూసిన పీస్ డి రెసిస్టెన్స్ అనే గోల్డెన్‌ పేస్ట్‌ ధర కూడా తక్కువేం కాదు. స్పెషల్ ఇన్‌గ్రీడియంట్స్‌తో తయారు చేసిన ఈ గోల్డోన్‌ బాయ్‌ ధర దాదాపు 5,000 యూరోలు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 4.5 లక్షలతో సమానం. ఈ బర్గర్ కేవలం తినే ఆహారంగా కాకుండా.. స్టేటస్‌కి సింబల్‌ మారిపోయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇది తీపి, పులుపు, ఉప్పు, చేదు వంటి రకరకాల రుచుల సమ్మేళనం అని ‘గోల్డెన్‌ బాయ్‌’ రుచిని అభివర్ణించింది. దీంతో బడా బాబులు ధరెంతైనా పర్లేదు మేమూ రుచి చూస్తాం అంటూ క్యూ కడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ రిచ్‌ బర్గర్ ఆన్‌లైన్‌లో వివాదానికి దారితీసింది. ప్రపంచ నలుమూలలా సామాజిక-ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఇటువంటి దుబారా అవసరమా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచలో నిత్యం ఎందరో పిడికెడు అన్నం కోసం ఆకలితో అలమటిస్తుంటే మీకేమే ఆహారం విలాస వస్తువై పోయింది అంటూ ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఇలాంటి అధిక ఖర్చుతో కూడిన ఆహారాలను పోస్టు చేయడం ఇకనైనా ఆపండని కాస్త గట్టిగానే నెటిజన్లు మండిపడ్డారు. ఇదీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బర్గర్ కథ. దీని రుచి, ధర, ప్రశంసలు కూడా ప్రపంచ వేదికపై చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.