Yama Shila: ఈ ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మూడో మెట్టు మీద అడుగు పెట్టరు.. ఎందుకంటే..!

పురాణ గ్రంధాలలో జగన్నాథ ఆలయాన్ని ఇల వైకుంఠంగా పేర్కొన్నారు. ఈ ఆలయంలో విష్ణువు స్వయంగా కొలువై ఉంటాడని ఒక నమ్మకం. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని.. వారికి మోక్షం కలుగుతుందని విశ్వాసం. ఈ ఆలయానికి సంబంధించి అనేక కథలు, రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అలాంటి అనేక రహస్యాలలో ఒకటి 'మూడవ మెట్టు' రహస్యం. ఈ మెట్టు ఆలయ ప్రధాన ద్వారం ముందు ఉంటుంది.

Yama Shila: ఈ ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మూడో మెట్టు మీద అడుగు పెట్టరు.. ఎందుకంటే..!
Puri Jagannath Mandir
Follow us
Surya Kala

|

Updated on: Jul 11, 2024 | 12:07 PM

హిందూ మతంలో బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, జగన్నాథపురి నాలుగు పవిత్ర స్థలాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ నాలుగు ప్రదేశాల్లో జగన్నాథ ఆలయం ఒడిశాలోని పూరి క్షేత్రంలో ఉంది ఇక్కడ జగన్నాథుని ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథుని రథయాత్ర కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ఇక్కడికి వస్తుంటారు. పురాణ గ్రంధాలలో జగన్నాథ ఆలయాన్ని ఇల వైకుంఠంగా పేర్కొన్నారు. ఈ ఆలయంలో విష్ణువు స్వయంగా కొలువై ఉంటాడని ఒక నమ్మకం.

ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని.. వారికి మోక్షం కలుగుతుందని విశ్వాసం. ఈ ఆలయానికి సంబంధించి అనేక కథలు, రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అలాంటి అనేక రహస్యాలలో ఒకటి ‘మూడవ మెట్టు’ రహస్యం. ఈ మెట్టు ఆలయ ప్రధాన ద్వారం ముందు ఉంటుంది. జగన్నాథుడి దర్శనానికి వెళ్ళి వచ్చే భక్తులు ఈ మెట్టు మీద అడుగు పెట్టకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే జగన్నాథ ఆలయంలో మూడో మెట్టు ఎక్కడం నిషిద్ధమని నమ్ముతారు.

యముడితో అనుబంధం ఉన్న మూడో మెట్టు

జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి ఆలయంలోకి ప్రవేశించడానికి 22 మెట్లు ఉన్నాయి. ఈ 22 మెట్లలో మూడవ మెట్టును యమశిల అంటారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో ఎవరైతే ఈ మూడవ మెట్టు మీద అడుగు పెట్టి వెళ్తారో.. అటువంటి వ్యక్తి యమలోక హింసను అనుభవించవలసి ఉంటుందని నమ్ముతారు. ఆలయంలో జగన్నాథుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా పొరపాటున కూడా మూడో మెట్లపై అడుగు పెట్టకూడదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆ భక్తుడు అప్పటి వరకూ సంపాదించిన పుణ్యం నశిస్తుందని నమ్మకం. ఈ మెట్టు నేరుగా యమ లోకానికి దారి తీస్తుందని .. ఈ మెట్టు మీద అడుగు పెట్టిన వారు వెంటనే యమ లోకానికి చేరుకుంటారని ఈ దేవాలయంలో అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకం. భక్తులు పొరపాటున కూడా ఈ మెట్లపైకి అడుగు పెట్టకుండా ఉండేందుకు ఆలయ సిబ్బంది ప్రత్యెక చర్యలు తీసుకున్నారు. ఈ యమ శిల మెట్టు అన్ని మెట్ల రంగుల వలె కాకుండా.. నలుపు రంగులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ నమ్మకం వెనుక ఉన్న పురాణ కథ

జగన్నాథుని ఆలయంలో మూడవ మెట్టుపైకి అడుగు పెట్టకూడదని ఈ నమ్మకం వెనుక ఒక పురాణ కథ ఉంది. దీని ప్రకారం ఒకసారి యమ ధర్మ రాజు జగన్నాథుడిని కలవడానికి వచ్చి.. ఓ ప్రభూ.. నీ ఆలయానికి వచ్చి నిన్ను దర్శించుకున్న భక్తుల సకల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది. దీంతో ఏ జీవి యమలోకంలోకి రావడం లేదు. ఇప్పుడు యమలోకం ఉనికి ప్రమాదంలో పడింది. కనుక దీనికి పరిష్కారం చూపించమని వేడుకున్నాడు. యమ ధర్మ రాజు విన్నపం విన్న జగన్నాథుడు.. యముడితో ఓ యమ ధర్మ రాజా చింతించకు.. ఇక నుంచి నువ్వు జగన్నాథ దేవాలయం నుంచి గర్భాలయానికి వచ్చే మెట్ల మార్గంలో మూడవ మెట్టు మీద ఆశీనుడివి అవ్వు. జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి నన్ను దర్శించుకున్న తర్వాత తిరిగి వెళ్తూ ఎవరైతే ఈ మూడో మెట్టుమీద అడుగు వేస్తారో.. అతనికి నా దర్శనం వలన కలిగిన పుణ్యం నశించి యమలోకానికి చేరుకుంటాడు అనే వరం ఇచ్చాడు.

మూడవ మెట్టు సుభద్రా దేవి నివాసం

మరొక పురాణ కథ నమ్మకం ప్రకారం ఈ ఆలయంలోని మూడవ మెట్టు జగన్నాథుని సోదరి అయిన సుభద్రా దేవి నివాసాన్ని సూచనట. దేవత నివాసాన్ని కాలితో తాకడం అగౌరవంగా పరిగణించబడుతుంది. కనుక భక్తులు పొరపాటున కూడా ఈ మూడో మెట్టు మీద అడుగు పెట్టరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..