Monsoon Health Tips: వర్షాకాలంలో అతిసారంతో ఇబ్బంది పడుతున్నారా..! నివారణ కోసం ఈ చిట్కాలు పాటించి చూడండి
ఈ సీజన్ లో తరచుగా అతిసారంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా సందర్భాలలో మందులు అందుబాటులో లేనప్పుడు లేదా తీసుకురావడానికి అవకాశం లేనప్పుడు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. దీంతో సులభంగా డయేరియా నుంచి బయటపడవచ్చు. చాలా సార్లు కడుపు వేడి కారణంగా విరేచనాలు అవుతాయి. అలాంటప్పుడు కడుపుని చల్లబరచడం చాలా ముఖ్యం. షర్బత్, వేడి నీరు, పుల్లని పెరుగు తినండి. అయితే ఎవరికైనా లాక్టోస్ సమస్య ఉంటే పెరుగును నివారించండి.
వర్షాకాలంలో కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. ఈ కాలంలో కడుపు నొప్పి, తరచుగా విరేచనాలు, అతిసారం సమస్యల బారిన ఎక్కువగా పడతారు. చాలా సందర్భాలలో ఔషధం అందుబాటులో లేని సమయంలో లేదా మేడిసిన్స్ తీసుకురాలేని సమయంలో కడుపు నొప్పి తో ఇబ్బంది పడుతుంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ఈ సింపుల్ టిప్స్ తో డయేరియా నుంచి బయటపడవచ్చు.
తరచుగా విరేచనాలు అవుతున్నట్లు అయితే.. ఇంట్లో మందులు అందుబాటులో లేనట్లయితే.. వెంటనే తినే ఆహారం విషయంపై దృష్టి పెట్టాలి. గోరు వెచ్చని నీటిలో ఉప్పు, పంచదార వేసుకుని ఆ నీటిని తరచుగా తీసుకోవాలి. అంతేకాదు సగ్గు బియ్యం కూడా మంచి మెడిసిన్ అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
శరీరంలో నీటి కొరత ఉండకూడదు
తరచుగా ప్రేగు కదలికలతో ఏర్పడే అతి పెద్ద సమస్య నిర్జలీకరణం. శరీరంలో నీరు కొరత కారణంగా రోగి పరిస్థితి విషమంగా మారుతుంది. కనుక ఉప్పు, చక్కెర కలిపిన వేడి నీతితో పాటు ఎలక్ట్రోలైట్స్ నీరు, ORS తరచుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. శరీరం హైడ్రేట్ గా ఉంచేలా చేస్తాయి.
అయితే విరేచనాలతో ఇబ్బంది పడుతుంటే తినే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారానికి దూరంగా ఉండడం మేలు.
వాటిని తినవద్దు
- కడుపు సమస్య అనిపిస్తే వేయించిన, స్పైసీ, హెవీ ఫుడ్ తినడం మానేయాలి.
- కడుపు బరువుగా ఉండే ఆహారాలు అంటే జీర్ణం అయ్యే సమయం అధికంగా ఉండే ఆహారాన్ని లేదా కడుపులో గ్యాస్‌ను కలిగించే ఆహారాన్ని తినవద్దు.
- ఆల్కహాల్, కాఫీ, బెర్రీలు, చాలా వేడి లేదా చాలా చల్లని పానీయాలు వంటి పానీయాలు తీసుకోవద్దు
- కొంతకాలం పాల ఉత్పత్తులను తీసుకోకండి
- డయేరియా నుంచి ఇంటి నివారణల ద్వారా ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ సమస్య పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)