ఒకప్పుడు వెక్కరించారు.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.. తొలి ట్రాన్స్‌జెండర్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా రికార్డు..

మధు రెండేళ్ల క్రితం పాట్నాకు వచ్చింది. పాట్నాలోని కొన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరూ మధుకు కోచింగ్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎవరైనా ట్రాన్స్‌జెండర్ కు కోచింగ్ ఇస్తే.. అది ఇతర పిల్లలపై ప్రభావం చూపుతుందని వారి ఆలోచన. అందుకే ఎ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల వారు మధుని చేర్చుకోవడానికి అంగీకరించలేదు. అయితే నిరాస చెందకుండా మధు ఆద్మ్య అదితి గురుకులం నడుపుతున్న గురు రెహమాన్‌ని కలిసింది. రెహమాన్ కి మధు తన విషయాలు అన్నీ చెప్పింది.

ఒకప్పుడు వెక్కరించారు.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.. తొలి ట్రాన్స్‌జెండర్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా రికార్డు..
Maanvi Madhu Kashyap
Follow us
Surya Kala

|

Updated on: Jul 11, 2024 | 8:20 AM

ఎగసి పడే కెరటం కాదు నాకు ఆదర్శం.. పడి లేచే అలలు నాకు ఆదర్శం అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఇందులో జీవిత సత్యం దాగుంది. కష్టపడి పని చేస్తే శ్రమకు తగిన ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఖచ్చితంగా శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అప్పుడు ఆ సక్సెస్ చాలా మధురంగా ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తీ ప్రతి వ్యక్తి ఈ సమాజంలో పోరాడవలసి ఉంటుంది.. అయితే కొందరు మాత్రం సమాజంతో పాటు సొంత వ్యక్తులతో కూడా చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తనను తాను నిరూపించుకోవడానికి ఈ యుద్ధం సొంత వ్యక్తులతో కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పోరాటం జీవితాన్ని జీవించడానికి సరైన మార్గాన్ని సూచిస్తుంది. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది మాన్వి మధు కశ్యప్. ఓ చిన్న పల్లెటూరి వాసి మాన్వి మధు కశ్యప్‌ పోరాట కథ నేటి యువతకు స్పూర్తి.. బీహార్‌ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిలో చాలా ప్రత్యేకంగా నిలిచింది మధు మాన్వి కశ్యప్.

మధు మాన్వి కశ్యప్ ఆనందం ఎందుకు భిన్నంగా అంటే ఆమె కథ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. దేశంలోనే ఇన్‌స్పెక్టర్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్ మహిళగా మధు మాన్వి రికార్డు సృష్టించింది. నిన్నటి వరకు ట్రాన్స్‌జెండర్ మహిళగా గుర్తింపు పొందిన మధు నేడు దేశంలోనే తొలి మహిళా ట్రాన్స్‌జెండర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా గుర్తింపు పొందారు. మధు సాధించిన ఈ విజయం అంత సులభంగా రాలేదు. తన కలలను నెరవేర్చుకోవడానికి సమయం, సమాజం, వ్యవస్థతో ఏకకాలంలో పోరాడాల్సి వచ్చింది. ఈ పోరాటం ద్వారా విజయం సాధించే సమయంలో కష్టాలు మరింత పెరుగుతాయి. చిన్న పల్లెటూరు బంకా నుంచి పాట్నాకు రావడం.. ఇక్కడికి వచ్చాక కొత్త గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ సులభం కాలేదని మధు చెబుతుంది.

రెండేళ్ల క్రితం పట్నం వచ్చిన మధు

మధు రెండేళ్ల క్రితం పాట్నాకు వచ్చింది. పాట్నాలోని కొన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరూ మధుకు కోచింగ్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎవరైనా ట్రాన్స్‌జెండర్ కు కోచింగ్ ఇస్తే.. అది ఇతర పిల్లలపై ప్రభావం చూపుతుందని వారి ఆలోచన. అందుకే ఎ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల వారు మధుని చేర్చుకోవడానికి అంగీకరించలేదు. అయితే నిరాస చెందకుండా మధు ఆద్మ్య అదితి గురుకులం నడుపుతున్న గురు రెహమాన్‌ని కలిసింది. రెహమాన్ కి మధు తన విషయాలు అన్నీ చెప్పింది.

ఇవి కూడా చదవండి

రోజూ ఐదు నుంచి ఆరు గంటలు కోచింగ్

రెహమాన్ మధు చెప్పింది విన్న తర్వాత కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. నుదుటిపై తిలకం పెట్టి ఈ రోజు నుంచి కోచింగ్ మొదలు అని చెప్పాడు. ఆ రోజు నుంచి మధు ప్రపంచం మారిపోయింది. రోజూ ఐదు నుంచి ఆరు గంటల పాటు కోచింగ్ తీసుకునేది. ఆ తర్వాత ఎలాంటి సందేహాలు వచ్చినా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు పడిన కష్టానికి తగిన ఫలితం నేడు ప్రపంచం మొత్తం చూస్తుంది. తన పట్ల సమాజం, కుటుంబం వైఖరి గురించి మాట్లాడుతూ సమాజం గురించి ప్రత్యేకంగా చెప్పలేను కాని కుటుంబ సభ్యుల వైఖరి తన పట్ల మెరుగ్గా ఉందని మధు చెప్పింది.

మన సమాజానికి సందేశం ఇచ్చిన మధు

ఈ రోజు తన విజయాన్ని చూసేందుకు మా నాన్న నరేంద్ర ప్రతాప్ సింగ్ ఈ లోకంలో లేరు.. అయితే మా అమ్మమ్మ మాలా దేవి చాలా సంతోషంగా ఉందని మధు అన్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో నాలుగో వ్యక్తి అయిన మధు.. తన కుటుంబ సభ్యులు తనకు అండగా నిలవడం అదృష్టమని చెప్పింది. అయితే మొదట తనను వ్యతిరేకించినా తర్వాత అంగీకరించారు. తాను కోచింగ్ కోసం గురు రెహమాన్ వద్దకు వెళ్ళిన సమయంలో విద్యార్థులందరూ తనతో సెల్ఫీలు దిగేవారని చెప్పింది. ఈరోజు కూడా తనతో సెల్ఫీలు దిగుతున్నారు.. అయితే అప్పటికి, ఇప్పటికి టైమ్ తేడా ఉందని మధు చెప్పింది. అంతేకాదు సమాజంలోని ప్రజలు ఏదైనా భిన్నంగా చేయాలనే ఆలోచించాలి.. ఎందుకంటే విజయం ఆలోచించడం ద్వారా మాత్రమే వస్తుంది. ఈరోజు తనకు లభించిన విజయం లాగానే సమాజంలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నానని మధు చెప్పింది.

దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ ఇన్‌స్పెక్టర్‌గా మధు గుర్తింపు

ఓ చిన్న గ్రామానికి చెందిన మాన్వి మధు కశ్యప్ దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ ఇన్‌స్పెక్టర్‌గా అవతరించింది. బీహార్ పోలీస్‌లో తొలిసారిగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా మారారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ట్రాన్స్‌మెన్‌, ఒకరు ట్రాన్స్‌మెన్‌. ఈ శుభవార్త విన్న మాన్వి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆమె చాలా గర్వంగా చెబుతుంది.. తాను ఈ స్టేజ్ కు చేరుకోవడానికి కారణమైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు గురు రెహమాన్ సర్‌కు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని మాన్వి అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..