AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: డేంజర్ జోన్లో వ్యోమగామి సునీత విలియమ్స్.. ఆమె రాకకు 48 నుండి 90 రోజుల సమయం పట్టవచ్చునని నాసా ప్రకటన

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ డేంజర్ జోన్లో చిక్కకున్నారు. కొలిగ్‌ బారీ బుచ్‌ విల్మోర్‌తో కలిసి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమ నౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్.. ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ కారణంగా వ్యోమ నౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు జూన్ 6న స్టార్‌లైనర్‌ సురక్షితంగా ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది. అయితే వారి యాత్ర సజావుగా సాగకపోవడంతో ఆమె తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం అయింది

NASA: డేంజర్ జోన్లో వ్యోమగామి సునీత విలియమ్స్.. ఆమె రాకకు 48 నుండి 90 రోజుల సమయం పట్టవచ్చునని నాసా ప్రకటన
Sunita WilliamsImage Credit source: NASA
Surya Kala
|

Updated on: Jul 11, 2024 | 7:20 AM

Share

జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపం కారణంగా డేంజర్ జోన్‌లో చిక్కుకున్నారు.. సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుండడంతో ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తున్నాయి. ప్రస్తుతం  ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు విలియమ్స్. త్వరలోనే స్పేస్ నుంచి సేఫ్‌గా తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

హీలియం లీకేజీ కారణంగా వ్యోమ నౌకలో పలు లోపాలు

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ డేంజర్ జోన్లో చిక్కకున్నారు. కొలిగ్‌ బారీ బుచ్‌ విల్మోర్‌తో కలిసి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమ నౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్.. ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ కారణంగా వ్యోమ నౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు జూన్ 6న స్టార్‌లైనర్‌ సురక్షితంగా ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది. అయితే వారి యాత్ర సజావుగా సాగకపోవడంతో ఆమె తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం అయింది. ఆమె రాక ఆలస్యం కారణంగా అనారోగ్యం ముప్పు పొంచిఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో విలియమ్స్ రాకపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై విలియమ్స్ స్పందించారు. తాము సురక్షింతగానే ఉన్నామని.. తమ ఆరోగ్యానికి ఏలాంటి డోకా లేదన్నారు. ఆలస్యంపై వివరాలు వెల్లడించారు. స్పేస్ నుంచి తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

సాంకేతిక సమస్యలు సరిచేసే పనిలో నాసా తలామునకలు

అయితే ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీకి తోడు వ్యోమ నౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు నిఫుణులు. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలామునకలవుతోంది. వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో ఎలాంటి హడావుడేమీ లేదంటున్నారు అధికారులు. విలియమ్స్‌ ఆమె కొలిగ్ భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం సునీత, విల్మోర్‌ వారం పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండి జూన్ 13న‌ బయల్దేరి 14న భూమికి చేరుకోవాలి. ప్రాబ్లమ్స్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అయితే బోయింగ్‌ స్టార్‌లైనర్‌ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈలెక్కన జూలై 22 దాకా సమయముంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే.. సునీత, బుచ్‌ విల్మోర్‌లను వెనక్కు తీసుకొచ్చేందుకు స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ ద్వారా, లేదంటే రష్యా సూయజ్‌ వ్యోమనౌక ద్వారా ప్రయత్నాలు చేయనున్నారు.

రోజులు గడిచే కొద్దీ అనారోగ్య సమస్యలు

స్పేస్ లో పరిస్థితులు భిన్నంగా ఉండడం వల్ల రోజులు గడిచే కొద్దీ సునీతకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు అంతరిక్ష పర్యటనకు వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చిన సునీత ఇప్పుడు కూడా సురక్షితంగా తిరిగొస్తుందని కుటుంబసభ్యులు, సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాసా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఆమె రాకకు 48 నుండి 90రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నాసా తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..