- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips on Gomati Chakra: What is gomati chakra and its benefits
Gomati Chakram: ఆధ్యాత్మికంగా గోమతి చక్రం ప్రయోజనాలు ఏమిటి? రుణ విముక్తి కోసం ఏమి చేయాలంటే
గోమతి చక్రం అరుదైన, అసాధారణమైన వస్తువు. గోమతి నదిలో కనిపించే ప్రత్యేకమైన షెల్. ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ గోమతి చక్రాన్ని ధన్ తేరాస్ ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వీటిలో సహజ మూలకాలు అద్భుతమైన వైద్యం, ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంది. శతాబ్దాలుగా ఇలాంటి వస్తువులు ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి ఉన్నాయి. అటువంటి అసాధారణమైన అంశం గోమతీ చక్రం.
Updated on: Jul 11, 2024 | 7:08 AM

గోమతి చక్రం, నాగ చక్రం లేదా శిలా చక్రం అని కూడా పిలుస్తారు. ఈ గోమతి చక్రాలు గుజరాత్‌లోని ద్వారక సమీపంలో ఉన్న పవిత్ర గంగా నదికి ఉపనది అయిన గోమతి నదిలో కనిపించే అరుదైన, సహజంగా ఏర్పడే నత్త ఆకారపు షెల్. దీని ప్రత్యేక ఆకారం అరుదైన లభ్యత, ప్రత్యేకమైన మూలం కారణంగా ఇది జ్యోతిషశాస్త్ర , ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని నమ్ముతారు. ఇవి ఒక వైపున చిన్న వృత్తాలు కలిగిన తెల్లని రంగు, చక్రం ఆకారంలో ఉండే రాయి. ఈ గోమతి చక్రాలు 'సుదర్శన చక్రం' నిర్మాణాన్ని పోలి ఉంటాయి. గోమతి చక్రం సంపద , శ్రేయస్సుకి అధిదేవత న లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు.

గోమతి చక్రం అరుదైన రాళ్ల మూలాల చుట్టూ అనేక పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం శ్రీ మహా విష్ణువు తన కృష్ణ అవతారంలో తన ప్రియమైన రాధకు ఆహారం, ఆశ్రయం కల్పించడానికి ద్వారకలోని గోమతి నది దగ్గర ఒక చిన్న మొక్కను నాటాడు. ప్రతిగా ఈ మొక్క రాధ ఆరాధించే ఈ చక్రాల రూపంలో తినదగని ఫలాలను ఇచ్చింది. గోమతి చక్రాలు కృష్ణ భగవానుడు దైవిక భోజనంలో పవిత్రమైన అవశేషాలని కన్నయ్య భార్య సత్యభామ చేత తయారు చేయబడినవి అని మరొక కథ సూచిస్తుంది. ఇంకొక పురాణం ప్రకారం విష్ణువు ఈ గోమతీ చక్రాలను ఉపయోగించి శంఖచూడ అనే రాక్షసుడిని చంపాడు. అతను అమరత్వం వరం కలిగి ఉన్న శంఖ చూడ రాక్షసుడికి మరణం సుదర్శన చక్రం ద్వారా మాత్రమే వస్తుంది. విష్ణువు ఈ గోమతి చక్రాలను రాక్షసుడిపైకి విసిరి.. అతని శరీరాన్ని కుట్టడం ద్వారా అతని మరణానికి దారితీసింది. అప్పటి నుండి గోమతి చక్రం హిందూ సంస్కృతిలో శుభం, దీవెనలకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

గోమతి చక్రంతో అనేక ప్రయోజనాలున్నాయి. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. ఇందుకోసం 11 గోమతి చక్రాలను తీసుకోండి. పసుపుని అద్ది.. శివుని మంత్రాన్ని పఠించండి. ఏదైనా నెలలో మొదటి సోమవారం రోజున వాటిని శివయ్య పాదాల చెంత ఉంచండి. ఈ చక్రాలను పసుపు రంగు దుస్తులలో కట్టి.. రుణాలు, అప్పులు, ఆర్థిక భారాల నుండి విముక్తి పొందడానికి వాటిని ప్రవహించే నీటిలో వదిలి పెట్టండి.

చెడు దృష్టి నుంచి రక్షణ: గోమతి చక్రాలు ఒక వ్యక్తి లేదా ప్రదేశం నుంచి ప్రతికూల, చెడు శక్తులను నిరోధించగలవు. ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడతాయి.

సంపద, శ్రేయస్సు: గోమతి చక్రాలు లక్ష్మీ దేవిని సూచిస్తాయి కనుక అవి సంపద, శ్రేయస్సును ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో సిరి సంపదల కోసం తరచుగా లక్ష్మీదేవికి, ముఖ్యంగా దీపావళి సమయంలో సమర్పిస్తారు.

మెరుగైన ఆధ్యాత్మిక శక్తి, అంతర్ దృష్టి: గోమతి చక్రం ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక శక్తితో పాటు అంతర్ దృష్టిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దైవిక శక్తి మార్గదర్శకత్వంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి వీటిని ధ్యానం, జపం లేదా ఆరాధనలో ఉపయోగించవచ్చు.

అడ్డంకులను తొలగిస్తుంది: ఈ గోమతి చక్రాలు ఒకరి మార్గంలో అడ్డంకులను తొలగించడంలో, కోరికలను నెరవేర్చడంలో సహాయపడతాయని నమ్ముతారు.




