- Telugu News Photo Gallery These are the railway stations with the most letters and the least letters in the country.
Indian Railway: దేశంలో అతి పెద్ద అక్షరాలు, అతి చిన్న అక్షరాలు కలిగిన రైల్వే స్టేషన్లు ఇవే..
భారత దేశంలో అతిపెద్ద ప్రజా, సరుకు రవాణా కలిగిన నెట్వర్క్ రైల్వే. నిత్యం లక్షల్లో ప్రయాణీకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాలకు, రాష్ట్రాలకు ప్రయాణిస్తూ ఉంటారు. అలాగే సరుకును కూడా వివిధ రాష్ట్రాలకు చేరవేస్తూ ఉంటుంది. ఇందులో ప్రయాణించడం ద్వారా అనేక సౌకర్యాలు, తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించవచ్చన్న ఉద్దేశంతో ఉంటారు ప్రజలు. అందుకే అధిక శాతం మంది రైల్వే వ్యవస్థపై అధారపడి ఉంటారు.
Updated on: Jul 11, 2024 | 9:17 AM

భారత దేశంలో అతిపెద్ద ప్రజా, సరుకు రవాణా కలిగిన నెట్వర్క్ రైల్వే. నిత్యం లక్షల్లో ప్రయాణీకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాలకు, రాష్ట్రాలకు ప్రయాణిస్తూ ఉంటారు. అలాగే సరుకును కూడా వివిధ రాష్ట్రాలకు చేరవేస్తూ ఉంటుంది.

ఇందులో ప్రయాణించడం ద్వారా అనేక సౌకర్యాలు, తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించవచ్చన్న ఉద్దేశంతో ఉంటారు ప్రజలు. అందుకే అధిక శాతం మంది రైల్వే వ్యవస్థపై అధారపడి ఉంటారు. ఇందులో ప్రయాణం చేయడం కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు.

అయితే ఇప్పుడు మనం ఈ రైల్వే వ్యవస్థ గురించి మాట్లాడుకోవడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో అతి పెద్ద పేరు అక్షరాల కలిగిన రైల్వే స్టేషన్ ఒక్కటి మాత్రమే ఉంది. అతి తక్కువ అక్షరాలు కలిగిన రైల్వే స్టేషన్ కూడా ఒక్కటి మాత్రమే ఉండటం గమనార్హం.

భారతదేశంలో అతిపెద్ద ఆంగ్ల అక్షరాలు ఉన్న రైల్వే స్టేషన్గా వెంకటనరసింహరాజువారిపేట గుర్తించబడింది. ఈ పేరులో 28 ఇంగ్లీష్ అక్షరాలు ఉండటం గమనార్హం. ఈ రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో ఉంది.

అలాగే అతి తక్కువ ఇంగ్లీష్ అక్షరాలు కలిగిన రైల్వే స్టేషన్ కూడా గుర్తించబడింది. ఒడిశాలోని జార్సుగూడలో ఉన్న 'ఐబి' రైల్వే స్టేషన్ పేరు కేవలం రెండక్షరాలకే పరిమితమైంది. హౌరా-నాగ్‌పూర్-ముంబై వెళ్లే రైళ్లు ఈ స్టేషన్ మీదుగానే వెళ్తాయి. అయితే ఇక్కడ స్టాపింగ్ ఉండదు.




