Phool Makhana Curry Recipe: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే పూల్ మఖానా మసాలా కర్రీ ఇలా చేసి పెట్టండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేస్తూ తినేస్తారు..
ఫూల్ మఖానాలు ఫాక్స్‌నట్స్ కాల్షియం, ఐరన్, ఫైబర్‌తో నిండి ఉంటాయి. అయితే ఎక్కువమంది వీటిని వేయించి తర్వాత అల్పాహారంగా తీసుకుంటారు. మరికొందరు ఫూల్ మఖానాతో మిక్చర్ వంటి స్నాక్ ఐటెంతో పాటు ఫూల్ మఖానా ఖీర్ వంటి రుచికరమైన ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. అయితే ఫూల్ మఖానాతో రుచికరమైన కూరలను కూడా తయారు చేసుకోవచ్చు. ఫూల్ మఖానా కూరను పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రోజు ఫూల్ మఖానా జీడిపప్పు కూర రెసిపీ తెలుసుకుందాం..
తామర గింజలను ఫూల్ మఖానా అని కూడా అంటారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఫూల్ మఖానాలు ఫాక్స్‌నట్స్ కాల్షియం, ఐరన్, ఫైబర్‌తో నిండి ఉంటాయి. అయితే ఎక్కువమంది వీటిని వేయించి తర్వాత అల్పాహారంగా తీసుకుంటారు. మరికొందరు ఫూల్ మఖానాతో మిక్చర్ వంటి స్నాక్ ఐటెంతో పాటు ఫూల్ మఖానా ఖీర్ వంటి రుచికరమైన ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. అయితే ఫూల్ మఖానాతో రుచికరమైన కూరలను కూడా తయారు చేసుకోవచ్చు. ఫూల్ మఖానా కూరను పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రోజు ఫూల్ మఖానా జీడిపప్పు కూర రెసిపీ తెలుసుకుందాం..
ఫూల్ మఖానా కర్రీకి కావలసిన పదార్ధాలు
ఫూల్ మఖానా- ఒక కప్పు టమోటాలు -2 బిర్యానీ ఆకు- 2 లవంగాలు-4 దాల్చిన చెక్క – చిన్న ముక్క యాలకులు -4 వెల్లుల్లి-4 కారం -1 టీస్పూన్ ఉప్పు రుచికి సరిపడా నూనె- 4 టేబుల్ స్పూన్లు నెయ్యి – రెండు స్పూన్లు జీడిపప్పు- 8 ధనియాల పొడి-2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ-1 అల్లం- 1 అంగుళం పసుపు-1/2 టీస్పూన్ కసూరి మేతి – కొంచెం కొత్తిమీర- చిన్నగా కట్ చేసిన ముక్కలు తాజా క్రీమ్ లేదా పెరుగు -2 టేబుల్ స్పూన్లు
తయారీ చేయాల్సిన విధానం: ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి వేడి చేసి.. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులో మఖానాలు (తామర గింజలు) వేసి వేయించి.. తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంతలో టమాటా పేస్ట్ రెడీ చేయండి.. ఒక మిక్సి గిన్నె తీసుకుని అందులో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క , జీడిపప్పులు , దాల్చిన చెక్క , యాలకులు, లవంగాలు వేసి మిక్సి పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలిలో నూనే వేసి వేడి చేసి బిర్యానీ ఆకులు రెండు వేసి వేయించి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఇప్పుడు వేయించిన ఉల్లిపయాల్లో కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలు , టమాటా ప్యూరీ ని వేసి బాగా వేయించండి. బాగా వేగి ఆయిల్ నుంచి వేరు అయ్యాక కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు తాజా క్రీమ్ లేదా పెరుగు వేసి బాగా కలపండి. ఉప్పుడు గ్రేవీ ఉడికిన తర్వత అరకప్పు నీరు వేసి బాగా గ్రీవీ ఉడికించి ఇప్పుడు ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న మఖానాలు వేసి బాగా కలపండి. మూడు, నాలుగు నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో కసూరి మేతి, తరిగిన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. రెస్టారెంట్ స్టైల్ లో టెస్టి టెస్టి పుల్ మఖనా కూర రెడీ.. దీనిని బిర్యానీ, చపాతీ, అన్నంలో తినొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..