పాముని పట్టుకుని టీజ్ చేస్తున్న వ్యక్తి.. పాము చేసిన దాడి చూస్తే గూస్‌బంప్స్ ఖాయం.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి పామును పట్టుకున్నాడు. ఒక చేతిలో పాముని బంధించి దానిని తన నోటి దగ్గర పెట్టుకుని ఆటపట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. అతడు చేస్తున్న పనులకు ఆ పాముకు చాలా కోపం వచ్చినట్లు ఉంది. దీంతో అతడిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. చాలా కోపంగా పాము దాడికి చేయడానికి ప్రయత్నించిన వెంటనే, ఆ వ్యక్తి దానిని తన నుండి దూరంగా పెట్టాడు

పాముని పట్టుకుని టీజ్ చేస్తున్న వ్యక్తి.. పాము చేసిన దాడి చూస్తే గూస్‌బంప్స్ ఖాయం.. వీడియో వైరల్
Snake Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jul 11, 2024 | 10:35 AM

ప్రకృతిలో ఉన్న జీవుల్లో పాములు ఒకటి. వీటి పేరు వింటే చాలు చాలా మందిలో భయం పుడుతుంది. ఎందుకంటే ఈ విష జీవి ఎవరినైనా ప్రాణాలను తీసేయ్యగలదు. అందుకనే పాము కనిపిస్తే చాలు అది విష పూరితమైనా కాకపోయినా… మానవులే కాదు, జంతువులు కూడా వాటి నుంచి దూరంగా వెళ్ళాలని కోరుకుంటాయి. వీలైనంత దూరంగా జరుగుతాయి కూడా.. అయితే కొంతమంది అనవసరమైన పనులతో ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుంటారు. ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో పాముని పట్టుకున్న ఓ వ్యక్తీ దానిని టీజ్ చేస్తూ కోపం తెప్పిస్తున్నాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి పామును పట్టుకున్నాడు. ఒక చేతిలో పాముని బంధించి దానిని తన నోటి దగ్గర పెట్టుకుని ఆటపట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. అతడు చేస్తున్న పనులకు ఆ పాముకు చాలా కోపం వచ్చినట్లు ఉంది. దీంతో అతడిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. చాలా కోపంగా పాము దాడికి చేయడానికి ప్రయత్నించిన వెంటనే, ఆ వ్యక్తి దానిని తన నుండి దూరంగా పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ టీజింగ్‌ మొదలుపెట్టాడు. ఇప్పుడు పాముకి మునుపటి కంటే ఎక్కువ కోపంగా నోటిని బాగా తెరచి కోరలుతో కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. మరుసటి క్షణంలో జరిగింది చూస్తే ఎవరికైనా గూస్‌బంప్స్ వస్తాయి. అతని పట్టు వదులైన వెంటనే.. పాము వ్యక్తి నోటిని కాటేసింది. ఈ దృశ్యం నిజంగా భయానకంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @therealtarzann అనే ఖాతాతో భాగస్వామ్యం చేయబడింది. జూలై 9న అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 66 వేల మందికి పైగా లైక్ చేసారు. అయితే కామెంట్ సెక్షన్ ప్రజల స్పందనలతో నిండిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి ఘటనలను మళ్ళీ ఎవరూ పునరావృతం చేయవద్దని ఎక్కువ మంది సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలు జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఒకరు ఈ వీడియోపై మాట్లాడుతూ మరణం ముందు చివరి ముద్దు అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా తెలుస్తున్న నీతి ఏమిటంటే ఎవరినైనా సరే వారు తట్టుకోగలిగినంతవరకు మాత్రమే ఇబ్బంది పెట్టండి. అంతకు మించి ఇబ్బంది పెడితే తిప్పలు తప్పవు అని.. ఈ వ్యక్తి దీనికి అర్హుడు. మరొకరు వ్రాశాడు. ఇంతకీ అతను బతికి ఉన్నాడా లేదాపోయాడా అని వినియోగదారు వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో మూర్ఖులకు కొరత లేదని కామెంట్ చేశారు మరికొందరు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..