ఏపీలోని ఆ చిన్న ఊరు.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఎందుకయ్యింది? అసలేంటి ఆ ఊరి స్పెషాలిటీ?

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామం ఇత్తడి వస్తువులకు ఎంతో ఫేమస్.. అక్కడ ఎక్కడ చూసినా ఇత్తడి వస్తువులే మనకు దర్శనమిస్తాయి. గ్రామంలోకి మొదలైంది మొదలు ఏ గడపలో చూసిన ఇత్తడి వస్తువుల తయారీలో స్థానికులు నిమగ్నమై ఉంటారు. అజ్జరం గ్రామం సుమారు 4 వేలమంది పైచిలుకు జనాభా కలిగిన ఓ గ్రామం.

ఏపీలోని ఆ చిన్న ఊరు..  ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఎందుకయ్యింది? అసలేంటి ఆ ఊరి స్పెషాలిటీ?
Ajjaram Brasscrafts
Follow us
B Ravi Kumar

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 11, 2024 | 1:54 PM

ఏలూరు: నాణ్యమైన ఇత్తడి పాత్రలు కొనాలనుకుంటున్నారా? అయితే మీరు ఆ ఊరు వెళ్లాల్సిందే. ఇంట్లో అలంకరణకు ఇత్తడి యాంటిక్విటీ వస్తువులు కావాలా వాటికి మీరు అక్కడకు వెళ్లాల్సిందే. ఓంకార నాదం వినిపించే గుడి గంటలు, నాలుగు ఊర్లకు వినబడే చర్చి గంటలు కావాలా? వీటి కోసమూ మీరు ఆ గ్రామానికి వెళ్లాల్సిందే.. ఏంటి ఎవరైనా ఏదైనా కావాలంటే మాల్స్, షాప్స్ చెబుతారు. మేం ఊరు గురించి మాట్లాడుతున్నా మనుకుంటున్నారా…అదే మరి ఆ ఊరు స్పెషల్.  సాధారణ గ్రామం..అయినా అక్కడ నుంచి విదేశాలకు వస్తువులు ఎగుమతి అవుతాయి. ఇంతకీ అంత ప్రత్యేకతలున్న ఊరు ఎక్కడుంది…దాని పేరేంటి..

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామం ఇత్తడి వస్తువులకు ఎంతో ఫేమస్.. అక్కడ ఎక్కడ చూసినా ఇత్తడి వస్తువులే మనకు దర్శనమిస్తాయి. గ్రామంలోకి మొదలైంది మొదలు ఏ గడపలో చూసిన ఇత్తడి వస్తువుల తయారీలో స్థానికులు నిమగ్నమై ఉంటారు. అజ్జరం గ్రామం సుమారు 4 వేలమంది పైచిలుకు జనాభా కలిగిన ఓ గ్రామం. సుమారు 90 శాతం వరకు జనాభా.. తమ కుల వృత్తలతో సంబంధం లేకుండా ఇత్తడి వస్తువులు తయారీ పైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఏ ఇంట్లో ఉపయోగించే ఇత్తడి వస్తువులైన తయారయ్యేది మాత్రం అజ్జరంలోనే… ఇక్కడ తయారయ్యే ఇత్తడి వస్తువులకు ప్రపంచ గుర్తింపు వచ్చిందంటే వారి వృత్తి నైపుణ్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గ్రామంలో ఏ ఇంటి గుమ్మంలో చూసినా ఇత్తడి వస్తువుల తయారు చేసే చిన్నతరహా కర్మాగారాలే మనకు దర్శనమిస్తాయి. ఏటా కోట్లలో వ్యాపారం సాగుతోంది.

Ajjaram Brasscrafts3

Ajjaram Brasscrafts

హస్తకళా ప్రియులకు అజ్జరం పట్ల మక్కువ..

అజ్జరం గ్రామస్థులు గత మూడు తరాలుగా ఇత్తడి వస్తువుల తయారీపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఇక్కడ కళాకారులు గతంలో పెద్ద ఎత్తున ఇత్తడి వస్తువులను తయారు చేసేవారు. అయితే ప్రస్తుతం ఫ్యాక్టరీలలో తయారైన ఇత్తడి వస్తువులు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లో అందుబాటులో ఉండడంతో  దీనిపై ఆదారపడి జీవిస్తున్న చేతివృత్తల వారికి ఆదరణ కాస్త తగ్గింది. హస్తకళలపై మక్కువ కలిగిన వారు మాత్రం అజ్జరంలో తయారయ్యే ఇత్తడి వస్తువులకే జై కొడుతున్నారు. దేవతామూర్తుల విగ్రహాలు, పూజా సామాగ్రి, బిందెలు, పళ్ళాలు, బొమ్మలు ఇలా ఎంత పెద్ద విగ్రహాన్ని అయినా ఇత్తడితో అందంగా మలిచి ఇవ్వడం ఇక్కడ చేతి వృత్తిదారుల ప్రత్యేకత. రోజుల వ్యవధిలోనే ఇత్తడి ముడిసరకుకు తమ  నైపుణ్యంతో జీవంపోస్తున్నారు.

Ajjaram Brasscrafts

Ajjaram Brass Crafts

అజ్జరం గ్రామంలో గృహోపకరణాలుగా ఉపయోగించే బిందెలు, కాగులు, కలాయ్ గిన్నెలు, గుండిగలు, పళ్ళాలు కూడా తయారుచేస్తారు. అలాగే దేవాలయాలకు సంబంధించిన ఇత్తడితో తయారు చేయబడిన మకరతోరనాలు, కలశాలు, ద్వజస్తంబ తొడుగులు, పంచలోహ విగ్రహాలు ఇత్తడితో ఇక్కడి వారు తయారు చేస్తారు. ఇలా తయారుచేసిన వస్తువులను మార్కెట్లో షాపులకు విక్రయిస్తారు. వివాహాలు, శుభకార్యాల సీజన్ సమయంలో అజ్జరం గ్రామం కళకళలాడుతుంది. నేరుగా వివాహాది శుభకార్యములకు కావలసిన కళా వస్తువులను వ్యాపారులతో సంబంధం లేకుండా వినియోగదారులే అక్కడికి వెళ్లి వారికి నచ్చిన వస్తువులను అతి తక్కువ ధరలకు ఇత్తడి వస్తువుల కళాకారుల నుంచే కొనుగోలు చేస్తుంటారు.

నాణ్యతకు గ్యారెంటీ..

ఇక్కడ వస్తువుల కోసం వచ్చే వినియోగదారులు సైతం ఇక్కడ లభించే ఇత్తడి  వస్తువులు ఎంతో నాణ్యంగా ఉంటాయని, బయట దొరికే వస్తువులలో ఇంత క్వాలిటీ ఉండదని చెబుతారు.  అందుకే స్వయంగా తామే అజ్జరం గ్రామానికి వచ్చి ఇత్తడి వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఇక్కడ తయారైన వస్తువులకు బయటి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పెద్దపెద్ద విగ్రహాలతో పాటు ప్రతి ఇంట్లో నిత్యం పూజలు చేసుకునే పూజ సామాగ్రి వరకు అన్ని వస్తువులను ఇక్కడ తయారుచేస్తారు. ఇక్కడ తయారుచేసిన వస్తువులు రాష్ట్రం నలుమూలలకే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాలకు, అలాగే వివిధ దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇత్తడి వస్తువులకు అజ్జరం గ్రామం ఫేమస్ అయ్యింది. ఇత్తడి వస్తువులు కొనాలంటే అజ్జరం వెళ్లాలంతే అనేట్టుగా అక్కడ ఇత్తడి వస్తువులు తయారి చేస్తున్న వారి వృత్తికి గుర్తింపు తెచ్చింది.

విదేశీయులను సైతం ఆకర్షిస్తున్న వస్తువులు

అజ్జరంలో తయారైన ఇతడి వస్తువులు ప్రస్తుతం విదేశాలకు సైతం విరివిగా ఎగుమతి అవుతున్నాయి. విదేశాల నుంచి వాట్సప్ కాల్ చేసి మరీ వారికి కావాల్సిన వస్తువులు తయారు చేయించుకుంటున్నారు. అలా తయారుచేసిన వస్తువులను కార్గో విమాన సర్వీసుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వస్తువుల నాణ్యతే వీరి పబ్లిసిటీ అనేట్టుగా ఉంటుంది. క్వాలిటీ విషయంలో రాజీపడకుండా అడిగిన వస్తువులు తయారు చేసి ఇవ్వడం ఇక్కడి వారి నైపుణ్యత. అందుకే అజ్జరం ఇత్తడి వస్తువుల కొనుగోలుకు విదేశీయులను సైతం ఆకర్షిస్తుంది.

Ajjaram Brasscrafts4

Ajjaram Brass crafts

తాత ముత్తాతల నుంచి ఇదే పని..

అజ్జరం గ్రామంలో సుమారు 150 సంవత్సరాలుగా ఇత్తడి వస్తువులను తయారు చేయడమే వృత్తిగా జీవిస్తున్నారు. సుమారు గ్రామంలో 2,500 మంది ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఇక్కడ కేజీ వస్తువు ధర రూ.600 , రూ.900 క్వాలిటీని బట్టి తయారు చేస్తున్నారు. ఇక్కడున్న ధరలకు రాష్ట్రంలో మరెక్కడ ఇలాంటి ఇత్తడి వస్తువులు లభించవని స్థానిక కళాకారులు చెబుతున్నారు. ఇత్తడి వస్తువులను హోల్సేల్ వ్యాపారులకు ఏ ధరకు ఇస్తామో.. తమ వద్దకు వచ్చిన వినియోగదారుడికి సైతం అదే ధరకు వస్తువులు విక్రయిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇక్కడ సొంత దుకాణాలు, తయారీ కేంద్రాలు ఉన్నందునే తక్కువ ధరకు ఇత్తడి వస్తువులను విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. తమకు వస్తువులు కావాలని ఆర్డర్ ఇచ్చిన వారికి ఆర్టీసీ కార్గో ఇతర రవాణా సంస్థల ద్వారా డెలివరీ ఇస్తామని తయారీదారులు చెబుతున్నారు.

ఇక్కడ వస్తువులు చాలా బాగున్నాయి..

ఇక్కడ వస్తువులు చాలా బాగున్నాయి అని, తమకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ ధరలకు, ఎంతో క్వాలిటీ వస్తువులు ఇస్తారని చెప్పడంతో అమలాపురం నుంచి వివాహం నిమిత్తం ఇత్తడి వస్తువులు కొనుగోలు చేసేందుకు అజ్జరం గ్రామం వచ్చామని, ఇక్కడ వివాహానికి కావలసిన జల్లెడలు పీటలు పళ్ళాలు రకరకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు.

పురాతన కాలం నుంచే ఇత్తడి వస్తువుల వాడకం..

పురాతన కాలం నుంచే ఇత్తడి పాత్రల వినియోగం ఉంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా చాలా సందర్భాల్లో పురాతన తవ్వకాల్లో ఎక్కువగా ఇత్తడి పాత్రలు బయటపడుతూ ఉంటాయి. బంగారంలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండే ఇత్తడి వస్తువులను ఇప్పుడు గృహలంకరణలో విరివిగా వాడుతున్నారు. ఇంటికి అంతమైన ఇంటీరియర్ డిజైనింగ్‌తో పాటు క్లాసిక్ టచ్ కోసం ఇత్తడితో తయారుచేసిన అలంకరణ వస్తువులు వాడుతున్నారు. ఇత్తడి పాత్రలు మతపరమైన వేడుకలు, పండుగలు, వివాహాది శుభకార్యక్రమాలు, సాంప్రదాయ ఆచారాలతోనూ ముడిపడి ఉంది.

Ajjaram Brascrafts5

Ajjaram Brass Crafts

రాగి, జింక్ మిశ్రమంతో ఇత్తడి వస్తువులు తయారు చేస్తారు. ఇత్తడి పాత్రలను ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇత్తడి పాత్ర దోషదపడుతుంది. శరీర ఆరోగ్యానికి ఇత్తడి పాత్రల వాడకం మంచిదని ఆయుర్వేదం కూడా సూచిస్తుంది. అలాగే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం, తుప్పు పట్టకపోవడం వంటి కారణంగా దీర్ఘకాలిక మన్నిక ఇత్తడి పాత్రల సొంతం.

ఓటీటీలో అల్లరోడి సినిమా బచ్చలమల్లి.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అల్లరోడి సినిమా బచ్చలమల్లి.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
శీతాకాలంలో మీ కారు మైలేజీ ఎక్కువ ఇవ్వాలా? డ్రైవింగ్‌లో ఈ చిట్కాలు
శీతాకాలంలో మీ కారు మైలేజీ ఎక్కువ ఇవ్వాలా? డ్రైవింగ్‌లో ఈ చిట్కాలు
పదేళ్లల్లో ఎంతో మార్పు.. బొమ్మల తయారీ రంగంలో 239 శాతం వృద్ధి
పదేళ్లల్లో ఎంతో మార్పు.. బొమ్మల తయారీ రంగంలో 239 శాతం వృద్ధి
ఆరోగ్యానికి వ‌రం సొంఠి.. రోజూ తీసుకుంటే శరీరంలో మ్యాజిక్‌లాంటి
ఆరోగ్యానికి వ‌రం సొంఠి.. రోజూ తీసుకుంటే శరీరంలో మ్యాజిక్‌లాంటి
వినియోగదారులకు షాక్‌.. పెరిగిన వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?
వినియోగదారులకు షాక్‌.. పెరిగిన వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?
ఈ ఐదుగురు ఆటగాళ్లు ఇక టెస్టు జట్టులో కనిపించడం కష్టమే!
ఈ ఐదుగురు ఆటగాళ్లు ఇక టెస్టు జట్టులో కనిపించడం కష్టమే!
ప్రగతి పథంలో దేశం పరుగులు.. ప్రపంచంలో కీలకంగా మారే అవకాశం
ప్రగతి పథంలో దేశం పరుగులు.. ప్రపంచంలో కీలకంగా మారే అవకాశం
తంగేడు మొక్కలో దాగివున్న ఔషధగుణాలు తెలిస్తే.. మతిపోవాల్సిందే..!
తంగేడు మొక్కలో దాగివున్న ఔషధగుణాలు తెలిస్తే.. మతిపోవాల్సిందే..!
మీ కాళ్ల మడమలు పగులుతున్నాయా? ఇలా చేస్తే మృదువుగా మారతాయి
మీ కాళ్ల మడమలు పగులుతున్నాయా? ఇలా చేస్తే మృదువుగా మారతాయి
శీతాకాలంలో.. గోంగూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
శీతాకాలంలో.. గోంగూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?