Yadagiri Gutta: యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..

ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయం ముఖ ద్వారం నుంచి స్వయంభువులను దర్శించుకునేవారు. నేటి నుంచి ప్రయోగాత్మకంగా ప్రధాన ఆలయంలోకి వచ్చిన భక్తులు మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ.. గర్భగుడి చెంతకు భక్తులు చేరేలా కాంప్లెక్స్‌ను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

Yadagiri Gutta: యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..
Yadagiri Gutta Temple
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Jul 11, 2024 | 9:42 AM

తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి భక్తులకు మరో గుడ్ న్యూస్. తిరుమల దేవస్థానం తరహాలో భక్తులకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభువుల దర్శనం కలగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత.. అత్యధిక సంఖ్యలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయం ముఖ ద్వారం నుంచి స్వయంభువులను దర్శించుకునేవారు. నేటి నుంచి ప్రయోగాత్మకంగా ప్రధాన ఆలయంలోకి వచ్చిన భక్తులు మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ.. గర్భగుడి చెంతకు భక్తులు చేరేలా కాంప్లెక్స్‌ను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

తిరుమల తరహాలో యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహులను దర్శించుకునే ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. గర్భగుడిలోని నారసింహుడిని మహాముఖ మండపంలో 26 అడుగుల దూరంలో ఉన్న వేదికపై నుంచి భక్తులు దర్శించుకోవచ్చని ఆలయ ఈవో భాస్కర్ రావు చెప్పారు. రూ.150 శీఘ్ర, ధర్మ దర్శన మార్గాలు గర్భగుడి వద్దకు చేరుకునే విధానంలో మార్పు తెచ్చి ఆ వరుసల్లోని భక్తులను కొత్తగా ఏర్పాటైన వేదిక పైనుంచి పంపిస్తారని తెలిపారు. ఇక ఆలయానికి వచ్చే దివ్యాంగులకు పశ్చిమ గోపురం నుంచి నేరుగా యాదాద్రీశుడి దైవదర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

అలాగే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సూచన మేరకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి తీర్థంతో పాటు శఠారి ఆశీర్వాదం ఇవ్వనున్నారు. ఈనెల 14వ తేదీన వనమహోత్సవం పేరిట యాదాద్రి క్షేత్ర పరిధిలో రెండు వేల మొక్కలు నాటేందుకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 15న ఉదయం 6.05 నిమిషాలకు సామూహిక ‘గిరి ప్రదక్షిణ’ నిర్వహిస్తున్నామని ఈవో వివరించారు. యాదాద్రి ఆలయంలో కొత్త నిత్యాన్నప్రసాద భవనాన్ని శ్రావణమాసం తొలివారంలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..