Ashada Utsavalu: ఇంద్రకీలాద్రికి పోటెత్తుతోన్న మహిళా భక్తులు.. ఆగష్టు 4 వరకు దుర్గమ్మకు ఆషాఢం సారె సమర్పణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసోత్సవాల్లో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పోటెత్తుతున్నారు. మేళ తాళాల మధ్య దుర్గమ్మకు ఆషాఢం సారే సమర్పిస్తున్నారు. ఆగష్టు 4వ తేదీ వరకూ అమ్మవారికి ఆషాఢ మాసం సారె అందజేయనున్నారు. ఈ క్రమంలోనే.. అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
ఆషాడ మాసం వచ్చిందంటే చాలు అమ్మవార్ల ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంటుంది. తమ గ్రామ దేవతలకు పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. ఘనంగా ఉత్సవాలను జరుపుతారు. అంతేకాదు అమ్మలగన్న అమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ కు ఆషాఢమాసం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి మహిళా భక్తులు సారె సమర్పించి తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసోత్సవాల్లో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పోటెత్తుతున్నారు. మేళ తాళాల మధ్య దుర్గమ్మకు ఆషాఢం సారే సమర్పిస్తున్నారు. ఆగష్టు 4వ తేదీ వరకూ అమ్మవారికి ఆషాఢ మాసం సారె అందజేయనున్నారు. ఈ క్రమంలోనే.. అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు సమ్పరిస్తున్నారు.
ఆషాఢ మహోత్సవం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారికి కూడా ఆషాఢం సారె సమర్పించారు మహిళలు. పెనుగంచిప్రోలులో రంగుల మండపం నుండి తిరుపతమ్మ దేవస్థానం వరకు సారెతో ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత.. ఆలయానికి చేరుకుని.. వేద పండితుల మంత్రోచరణల మధ్య అమ్మవారితోపాటు.. సహ దేవతలకు కూడా సారె అందజేశారు. జూలై 6న ప్రారంభమైన ఆషాఢమాసం.. ఆగష్టు 4న ముగుస్తుంది. ఈ నెల రోజులు ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం నెలకొంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..