ఇదో వింత ఆచారం.. గర్భగుడిలో దేవుడికి మంచ్‌ చాక్లెట్‌ నైవేద్యం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

కొన్ని దేవాలయాలలో పాయసం, పొంగల్, పులిహోర, దద్దోజనం వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ, ఇక్కడ ఒక గుడిలో దేవుడికి మంచ్ చాక్లెట్ నైవేద్యంగా సమర్పిస్తారు. అరుదైన, వింత ఆచారం వెనుక ఉన్న కథ తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు.

ఇదో వింత ఆచారం.. గర్భగుడిలో దేవుడికి మంచ్‌ చాక్లెట్‌ నైవేద్యం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
Munch Chocolate
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 12, 2024 | 9:51 PM

అన్ని హిందూ దేవాలయాలలో వివిధ రకాల పండ్లు, పువ్వులు, పలు రకాల ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదాహరణకు, అయ్యప్పకు నెయ్యి, కృష్ణుడికి వెన్న, గణేశుడికి లడ్డూలు సమర్పించడం మనకు తెలుసు. అలాగే, కొన్ని దేవాలయాలలో పాయసం, పొంగల్, పులిహోర, దద్దోజనం వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ, ఇక్కడ ఒక గుడిలో దేవుడికి మంచ్ చాక్లెట్ నైవేద్యంగా సమర్పిస్తారు. కేరళలోని ఓ అరుదైన ఆలయంలో ఈ వింత ఆచారం జరుగుతోంది. దీని వెనుక ఉన్న కథ వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు.

కేరళలోని మంచ్ మురుగన్ ఆలయంలో మంచ్ చాక్లెట్‌ను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అంతే కాదు, ఈ ఆలయంలో ప్రత్యేక సందర్భాలలో మంచ్ చాక్లెట్‌ను భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. గత ఆరేళ్లుగా ఈ పద్ధతి ప్రారంభమైందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

వాస్తవానికి ఒకసారి ఒక గుడిలో ఒక బాలుడు ఆడుకుంటూ గుడి గంట మోగించాడట. అలా చేసినందుకు అతని తల్లిదండ్రులు వాడిని తిట్టారు.  దాంతో ఆ రాత్రి బాలుడికి విపరీతమైన జ్వరం వచ్చిందట. ఆ జ్వరంలో బాలుడు రాత్రంతా మురుగన్ పేరు చెప్పుకుంటూనే ఉన్నాడట. దాంతో ఆ మరుసటి రోజు అతని తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పూజారి బాలుడి తల్లిదండ్రులను దేవుడికి ఏదైనా సమర్పించమని అడుగగా, తల్లిదండ్రులు భక్తిశ్రద్ధలతో దేవుడికి పూలు, పండ్లు సమర్పిస్తే, బాలుడు గర్భగుడిలోని దేవుడికి మంచ్ చాక్లెట్ సమర్పించాడు. వెంటనే బాలుడు అద్భుతంగా కోలుకున్నాడు. ఆ తర్వాత మంచ్ చాక్లెట్‌ను నైవేద్యంగా సమర్పించి ఆలయంలో ప్రసాదంగా పంచే సంప్రదాయం కొనసాగుతూ వచ్చిందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!