AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఊకో కాకా..! కొట్లాట దేనికి .. కూర్చొని మాట్లాడుకోవాలి.. ఎద్దుల పంచాయితీలో ఈ కుక్కే పెద్దమనిషి

సాధారణంగా కొంత మంది వీధుల్లో పడి గొడవపడుతుంటారు. మనుషుల మధ్య పంచాయతీలో కొందరు కొట్టుకుంటుంటే.. మరికొందరు అడ్డుకోవటం చూస్తుంటాం. అలాగే, వీధి కుక్కలు కూడా  ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ, వైరల్ వీడియోలో రెండుఎద్దులు కుమ్మేసుకుంటుంటే.. ఒక కుక్క ఏం చేసిందో చూస్తే మీరు ఫిదా అవ్వాల్సిందే.

Watch: ఊకో కాకా..! కొట్లాట దేనికి .. కూర్చొని మాట్లాడుకోవాలి.. ఎద్దుల పంచాయితీలో ఈ కుక్కే పెద్దమనిషి
Cows Started Fighting On The Road
Jyothi Gadda
|

Updated on: Jul 11, 2024 | 9:56 PM

Share

సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఊహించలేము. కొన్నిసార్లు డ్యాన్స్ వీడియోలు, కొన్నిసార్లు జంతువుల వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతాయి. తరచుగా, కుక్కల వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. కుక్కలు ఇతర జంతువులతో స్నేహం చేయటం, జాతి వైరం మర్చిపోయి ఇతర జంతువు పిల్లలకు పాలు పడుతున్న వీడియోలు ఇంటర్‌నెట్‌లో అనేకం చూశాం. అలాగే, వీధి కుక్కల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం కనిపిస్తున్నాయి. కుక్కల కారణంగా చిన్నారులు సహా అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కానీ, ఇక్కడ ఒక వీధి కుక్క చేసిన పని మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

సాధారణంగా చాలా మంది వీధుల్లో పడి గొడవపడుతుంటారు. మనుషుల మధ్య పంచాయతీలో కొందరు కొట్టుకుంటుంటే.. మరికొందరు అడ్డుకోవటం చూస్తుంటాం. అలాగే, వీధి కుక్కలు కూడా  ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ, వైరల్ వీడియోలో రెండుఎద్దులు కుమ్మేసుకుంటుంటే.. ఒక కుక్క ఏం చేసిందో చూస్తే మీరు ఫిదా అవ్వాల్సిందే. వైరల్‌ వీడియోలో రెండు ఎద్దులు నడిరోడ్డుపై పోట్లాడుకోవడం ప్రారంభించాయి. ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోలో భర్రాలో రెండు ఎద్దులు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఈ సమయంలో అక్కడికి ఓ కుక్క వచ్చి రెండు ఎద్దుల యుద్దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తోంది. అయినా ఆ రెండు ఎద్దులు ఆగలేదు. కానీ, ఈసారి కుక్క కూడా వెనక్కి తగ్గకుండా మళ్లీ వాటి మధ్యలోకి దూరింది. చివరికి కుక్క ప్రయత్నాలు ఫలించాయి. ఆ రెండు ఎద్దులు ఫైటింగ్ ఆపేశాయి. వాటి పోరాటాన్ని ఆపేసి అక్కడ్నుంచి వెళ్లిపోతాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో Instagramలోని @confused.aatma ఖాతాలో షేర్‌ చేయబడింది. వీడియోకు ఇప్పటివరకు ఐదు మిలియన్లకు పైగా వీక్షణలు, ముప్పై ఆరు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.. అలాగే, చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందించారు. ఒక యూజర్‌ స్పందిస్తూ..ఈ కుక్కకు అవార్డు ఇవ్వండి” అని కామెంట్‌లో రాశాడు. మరొక వినియోగదారు ఇంత తెలివైన కుక్క ఉంటే ఎలాంటి సంక్షోభం రాదని మరొకరు రాశారు.