Viral News: అలసిపోయి చెట్టు కింద నిద్రపోయిన పెద్దాయన.. తల వద్ద ఏదో కదిలిన శబ్ధం.. లేచి చూడగా
ముఖ్యంగా వర్షాకాలంలో పాముల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వర్షాలు, వరదల కారణంగా తరచూ పాములు జనావాసాల్లోకి రావటం, ఇళ్లలోకి దూరటం జరుగుతూ ఉంటుంది. ఇలా పాములు ఎదురైనప్పుడు వాటికి ఏ మాత్రం హాని చేయకుండా వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
సాధారణంగా పల్లెటూర్లలో ప్రజలు పొలం పనులకు వెళ్తుంటారు. మధ్యాహ్నం భోజన సమయంలో కాసేపు అలా పక్కనే ఉన్న చెట్టుకింద సేదతీరుతుంటారు. పొలం పనులకు వెళ్లిన వారు మాత్రమే కాకుండా.. ఊళ్లలో పెద్ద మనుషులు చెట్ల కింద కూర్చోని రాజకీయాలు చర్చింస్తుంటారు. కాలక్షేపానికి మంతనాలు కొడుతుంటారు. అలాగే, ఇక్కడ కూడా ఒక పెద్దాయన ఏదో గుడి సమీపంలోని చెట్టు కింద పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు. అంతలోనే అతనికి ఒక కలలాంటి ఊహించని సీన్ ఎదురైంది. ఆ వ్యక్తి పక్క నుంచి ఓ భారీ సర్పం పాకుతూ వెళ్లిపోయింది. అతడి తలను తాకుతూ వెళ్లడంతో ఉలిక్కిపాడు లేచాడు. ఇదంతా దూరం నుంచి ఎవరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, అది కాస్త వైరల్‌గా మారింది. కాగా, వీడియో తీసిన వ్యక్తిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ షాకింగ్ ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లా కొడుంగల్లూర్‌లో చోటు చేసుకుంది. కురుంబ భగవతీ ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి అలసిపోయి నిద్రిస్తుండగా పాము అతడి సమీపం నుంచి పాకుతూ వెళ్లిపోయింది. నేరుగా అతని తలకు దగ్గర వచ్చిన ఆ పాము.. అతన్ని దాటుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్న మరో చెట్టు తొర్రలోకి చొరబడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ గగుర్పాటుకు గురవుతున్నారు.
ఇంటర్‌నెట్‌లో ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే, అది విషపూరిత సర్పం కాదని జంతు ప్రేమికులు చెబుతున్నారు. పాములు తమకు ప్రమాదం ఉందని భావించిన సందర్భంలోనే కాటు వేస్తాయని.. వాటి దారిన వాటిని వదిలేస్తే ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లిపోతాయని చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పాముల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వర్షాలు, వరదల కారణంగా తరచూ పాములు జనావాసాల్లోకి రావటం, ఇళ్లలోకి దూరటం జరుగుతూ ఉంటుంది. ఇలా పాములు ఎదురైనప్పుడు వాటికి ఏ మాత్రం హాని చేయకుండా వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..