Kangaroos Fighting Video: కంగారుల కొట్లాట.. అచ్చం మనలానే.. వీడియో వైరల్!
సోషల్ మీడియాలో ఎన్నో వేల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఏ వీడియో ఎప్పుడు ట్రెండ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొత్తగా ఉంటే చాలు నెట్టింట తెగ వైరల్ అవుతాయి. ప్రతి రోజూ వందలాది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో చాలా రకాల వీడియోలు ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా ట్రెండ్..

సోషల్ మీడియాలో ఎన్నో వేల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఏ వీడియో ఎప్పుడు ట్రెండ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొత్తగా ఉంటే చాలు నెట్టింట తెగ వైరల్ అవుతాయి. ప్రతి రోజూ వందలాది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో చాలా రకాల వీడియోలు ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా ట్రెండ్ అవుతాయి. అయితే ఈ సారి ప్రపంచంలోనే అరుదైన జంతువులుగా భావించే కంగారు వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది.
కంగారుల వీడియోనా.. వీటిల్లో కొత్తగా ఏముంది అనుకుంటున్నారా.. రెండు కంగారులు కొట్టుకుంటున్న వీడియో. అందులోనూ అవి అచ్చం మనుషుల్లానే కొట్టుకుంటున్నాయి. ఈ వీడియోలను ఎవరు షూట్ చేశారో తెలీదు కానీ.. అచ్చం మనుషుల్లానే ఈ కంగారులు కొట్టుకుంటున్నాయి. నిజంగానే ఈ వీడియో చూస్తే నవ్వు వచ్చేస్తుంది.
ఈ వీడియో పార్క్‌లో షూట్ చేసినట్టు ఉంది. అక్కడ ఉన్న రెండు కంగారులు ఏదో బరిలో దిగేందుకు సిద్ధమైనట్టు ఒకదానిని మరొకటి చూసుకుంటున్నాయి. అయితే సడెన్‌గా ఫైటింగ్ ప్రారంభించాయి. అది కూడా అచ్చం మనుషుల్లానే. తగ్గేదేలా అంటూ బరిలో దిగి కొట్టుకుంటున్నాయి. మరి ఈ వీడియో ఎక్కడిదో.. కానీ ఈ కంగారులు కొట్టుకుంటున్నప్పుడు దీనికో సౌండ్ యాడ్ చేశారు. దీంతో మరింత నవ్వు తెప్పిస్తుంది. మీరు కూడా ఓ లుక్ వేసేయండి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరింత ఫన్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram