AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Alert: పాము ఎదురుపడితే ఏం చేయాలి..? టెన్షన్‌ పడకుండా ఇలా చేయండి చాలు..!

పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. పాములతో చెలగాటం ఆడేవారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే అకస్మాత్తుగా విషపూరిత పాము మీ ముందుకు వచ్చినా లేదా మిమ్మల్ని వెంటాడితే మీరు ఏం చేస్తారు? ఈ విషయంలో చాలా మంది చాలా రకరకాల ఉపాయాలు చెబుతుంటారు. పాములు..

Snake Alert: పాము ఎదురుపడితే ఏం చేయాలి..? టెన్షన్‌ పడకుండా ఇలా చేయండి చాలు..!
Snake
Jyothi Gadda
|

Updated on: Jul 10, 2024 | 9:04 PM

Share

ప్రస్తుత సీజన్‌ వర్షాకాలం. వానలు, వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పాముల బెడద పెరిగిపోతుంటుంది. వాటిలో చాలా విషపూరిత పాములు కూడా ఉన్నాయి. వరదల కారణంగా పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. పాము కాటుతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి క్రమంలో అకస్మాత్తుగా విషపూరిత పాము ఇంటి ఆవరణలోకి వచ్చినా, లేదంటే మీ ఇంట్లోకి ప్రవేశించినా భయంతో వణికిపోతుంటారు. అయితే పాములను భయపెట్టే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మనం పాములను చూసి భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పాములకే మనం అంటే భయం అంటున్నారు స్నేక్‌ క్యాచర్లు. కానీ, ఆ పాము విషపూరితమైనా కాకపోయినా పామును చూస్తే ప్రతి ఒక్కరికీ భయం వేస్తుంది. పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. పాములతో చెలగాటం ఆడేవారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే అకస్మాత్తుగా విషపూరిత పాము మీ ముందుకు వచ్చినా లేదా మిమ్మల్ని వెంటాడితే మీరు ఏం చేస్తారు? ఈ విషయంలో చాలా మంది చాలా రకరకాల ఉపాయాలు చెబుతుంటారు. పాములు వలయాలుగా తిరుగుతాయని, అందుకే పాములతో పరిగెత్తితే పట్టుకోలేమని కొందరు అనుకుంటే, పామును ఏదైనా తీసుకుని కొడితే పాము పారిపోతుందని లేదంటే, చనిపోతుందని మరికొందరు అనుకుంటారు.

అయితే ఈ ప్రపంచంలో 3 వేలకు పైగా జాతుల పాములు ఉన్నాయి. అందులో మనుషులను చంపగలిగే పాములు 7 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అయితే విషసర్పం ముందుకు వస్తే ఏం చేయాలి? విషపూరితమైన పాము కాటు నుండి తప్పించుకోవాలంటే.. దానుంచి పారిపోకుండా ప్రశాంతంగా ఉండటమే ఉత్తమ మార్గం అంటున్నారు స్నేక్‌ క్యాచర్‌. ఎందుకంటే పాములు ఊరికే దాడి చేయవు. కానీ, పాముల ముందు నడవాలంటేనే భయపడి పారిపోవాలనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

కానీ, పామును గాయపర్చకూడదు. మీరు కూడా ఆందోళన చెందకూడదు. అప్పుడు అవి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి దాడి చేయవచ్చు. అంతేకాదు.. పాములు చాలా వరకు స్పష్టంగా చూడలేని చాలా ఉన్నాయి. పాము ఎదురైనప్పుడు మీరు ప్రశాంతంగా ఉండిపోతే ఆ పాము ఏమీ చేయదు. మీరు పొరపాటున పాముపైకి అడుగుపెట్టినట్లయితే పాము దాడి చేస్తుంది. లేదంటే అది వెంటనే కాటు చేస్తుంది. కాబట్టి పాములను ఎదుర్కోవటానికి ఉత్తమ మార్గం ప్రశాంతంగా ఉండటమే. పామును దాని దారిలో దాన్ని వెళ్లనివ్వండి. మీరు కూడా నిశ్శబ్దంగా నిలబడిపోండి అది మీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..