AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బదిలీపై మాస్టారు.. ఘనంగా మేళ తాళాలతో ఊరేగించిన గ్రామస్థులు

ఎంతో ఆర్భాటంగా టపాసులు పేలుస్తూ, ఓపెన్ టాప్ కారులో వస్తున్న ఆయనకు పూల వర్షం కురిపించారు. బాజా బజయింత్రీలతో స్వాగతం పలికి అమాంతంగా ఒక్కసారిగా ఎత్తుకుని ఊరేగించారు. అతను ఓ రాజకీయ నాయకుడో, ఓ స్వామీజీనో ఆనుకుంటున్నరా ఏంది..? అదేం కాదు.

Telangana: బదిలీపై మాస్టారు.. ఘనంగా మేళ తాళాలతో ఊరేగించిన గ్రామస్థులు
Teacher Farewell
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 10, 2024 | 8:00 PM

Share

ఎంతో ఆర్భాటంగా టపాసులు పేలుస్తూ, ఓపెన్ టాప్ కారులో వస్తున్న ఆయనకు పూల వర్షం కురిపించారు. బాజా బజయింత్రీలతో స్వాగతం పలికి అమాంతంగా ఒక్కసారిగా ఎత్తుకుని ఊరేగించారు. అతను ఓ రాజకీయ నాయకుడో, ఓ స్వామీజీనో ఆనుకుంటున్నరా ఏంది..? అదేం కాదు. అడవిలోని ఆదివాసీల పిల్లలను ఆణిముత్యాల్లా తయారు చేసిన ప్రభాకర్ సారుకు ఊరు ఊరంతా పలికిన వీడ్కోలు అంతా ఇంత కాదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ప్రభాకర్ ఉద్యోగ ప్రమోషన్‌పై వెళ్తుండగా గ్రామస్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. గత పన్నెండేళ్లుగా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ స్థానికుల అభిమానాన్ని చూరగొన్నారు. అంతేకాకుండా పాఠశాల అభివృద్ధికి, నూతన భవన నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎనలేని కృషి చేశారు. విద్యార్థులకు పుస్తకాలను, దుస్తులను, విద్యా సామాగ్రిని సొంతంగా సమకూరుస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ మంచి మాస్టారుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పర్ణశాల హైస్కూల్ కు స్కూల్ అసిస్టెంట్ గా బదిలీ కావడంతో గ్రామంలో మేళ తాళాలు, బాణాసంచా కాల్పుల మధ్య ఊరేగించి సన్మాన అనంతరం గ్రామస్థులు వీడ్కోలు పలికారు. మరోవైపు మాస్టారు ఊరి విడిచి వెళ్తుండటంతో కొందరు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…