AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్థిక నిర్వహణలో ఈ రాశుల వారిదే అగ్రస్థానం.. ఈ ఏడాది బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!

ఆదాయం ఎంత పెరిగినా ఆర్థిక నిర్వహణ సజావుగా, సమర్థవంతంగా లేనప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. జ్యోతిషశాస్త్రం ఆర్థిక నిర్వహణకు, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించే వారు, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించేవారు విజయాలు సాధిస్తారు.

ఆర్థిక నిర్వహణలో ఈ రాశుల వారిదే అగ్రస్థానం.. ఈ ఏడాది బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!
Money Astrology 2024
Janardhan Veluru
|

Updated on: Jul 10, 2024 | 6:45 PM

Share

ఆదాయం ఎంత పెరిగినా ఆర్థిక నిర్వహణ సజావుగా, సమర్థవంతంగా లేనప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. జ్యోతిషశాస్త్రం ఆర్థిక నిర్వహణకు, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించే వారు, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించేవారు విజయాలు సాధిస్తారు. ఇందుకు సంబంధించిన గ్రహాలు శని, బుధులు. ఇవి రెండూ సరిగ్గా ఉన్న పక్షంలో తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా కుబేరులవుతారు. ప్రస్తుతం వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏడాదంతా ధన వ్యవహారాలు జాగ్రత్తగా సాగిపోతాయి.

  1. వృషభం: డబ్బు కూడబెట్టడంలో ఈ రాశిని మించినవారుండరు. జమాఖర్చుల విషయంలో వీరు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఈ రాశివారిది పొదుపు తత్వం. ధన స్థానాధిపతి బుధుడు అయినందువల్ల సాధారణంగా వీరు ప్రతి రూపాయిని ప్రణాళికాబద్దంగా ఖర్చు చేస్తారు. ఆర్థికంగా లాభం ఉంటే తప్ప ఖర్చుపెట్టరు. ఈ ఏడాది వీరికి గురువు అనుగ్రహం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. అయితే, గట్టి ప్రయత్నంతో వీరు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే సూచనలున్నాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల వీరి ఆదాయం గతం కంటే అనేక రెట్లు పెరిగే అవ కాశం ఉంది. అయితే, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందాలనే తత్వం వల్ల వీరు ఈ ఏడాది ఖర్చులు బాగా తగ్గించుకుని పొదుపు పాటించడం జరుగుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో ఆరి తేరిన ఈ రాశివారు వీటి మీద ఎక్కువగా మదుపు చేయడం జరుగుతుంది. ఈ రాశిలోనే ప్రస్తుతం బుధుడు సంచారం చేస్తున్నందువల్ల వీరొక వ్యాపారి మాదిరిగా వ్యవహరించే అవకాశం ఉంది.
  3. కన్య: ఈ రాశ్యధిపతి బుధుడు వ్యాపార సంబంధమైన గ్రహం అయినందువల్ల ఆదాయం పెంచుకోవడమే తప్ప వీరికి అనవసర ఖర్చులకు అవకాశం ఉండదు. ఆరవ స్థానంలో శని సంచారం వల్ల వీరు ఎవరికైనా డబ్బు ఇవ్వడమే కాదు, తీసుకోవడం కూడా తక్కువగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆదాయాన్ని విపరీతంగా పెంచుకోవడంతో పాటు ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం జరుగుతుంది. షేర్లు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని బాగా పెంచే అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశివారు సాధారణంగా ఆర్థిక వ్యవహారాల్లో పిసినారిగా వ్యవహరిస్తుంటారు. సాధారణంగా వీరు అవసర ఖర్చులే తప్ప అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉండదు. పైసా పైసా కూడబెట్టడంలో, రహస్యంగా దాచేయడంలో వీరిని మించినవారుండరు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహ రిస్తారు. ఈ ఏడాది వీరి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఖర్చులు తగ్గిం చుకోవడం, పొదుపు చేయడం, మదుపు చేయడం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయం పెరిగే అవకాశమే ఉంటుంది. అయితే, గురువు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల ఒక్క నయాపైసను కూడా వృథాగా ఖర్చు చేసే అవకాశం ఉండదు. ఈ ఏడాది చివరి నాటికి వీరు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించుకుంటారు. బ్యాంక్ నిల్వలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటారు. అనేక మార్గాలో ఆదాయం గడిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. అయితే, పొదుపు మంత్రాన్ని ఎక్కువగా పఠిస్తారు.
  6. మకరం: ఈ రాశివారికి శనీశ్వరుడే ధనాధిపతి కావడం వల్ల ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటారు. సాధారణంగా అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం వీరి జీవితంలో ఉండదు. చాలా పొదుపుగా జీవితం గడపడంలో వీరి తర్వాతే ఎవరైనా. ప్రతి క్షణం ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసే ఈ రాశివారు ఈ ఏడాది అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే అవకాశం ఉంది. ఇందుకు వీరు తమ అవసరాలను తగ్గించుకోవడం కూడా జరుగుతుంది.