AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Oil For Skin : కొబ్బరినూనెలో దాగివున్న బ్యూటీ సీక్రెట్‌..! తెలిస్తే ఇక వదిలిపెట్టరు..

కొబ్బరి నూనె అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వంటలో కొబ్బరినూనె వాడితే ఆహారం రుచి పెరుగుతుంది. అంతే కాదు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇవి మాత్రమే కాదు.. కొబ్బరి నూనెలో అందం రహస్యం కూడా ఉందని మీకు తెలుసా..? జుట్టు సంరక్షణ, చర్మ సంరక్షణ, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ, బరువు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలతో కొబ్బరి నూనెను ఆరోగ్యానికి ఔషధ నిధిగా అభివర్ణించారు.

Coconut Oil For Skin : కొబ్బరినూనెలో దాగివున్న బ్యూటీ సీక్రెట్‌..! తెలిస్తే ఇక వదిలిపెట్టరు..
Coconut Oil For Skin
Jyothi Gadda
|

Updated on: Jul 08, 2024 | 4:59 PM

Share

చర్మ సంరక్షణ కోసం కొబ్బరినూనె: కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమల నివారణకు సహాయపడతాయి. ఇందులోని లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపే సామర్థ్యం ఉంటుంది. మన శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్ స్థాయిలను పెంచే సామర్థ్యం కొబ్బరి నూనెకు ఉంది. కొబ్బరి నూనె చర్మ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ వంటి కొవ్వు ఆమ్లాలు వాటి యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

* బరువు తగ్గడం: రోజువారీ ఆహారంలో కొబ్బరి నూనె తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాదు బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది.

* జుట్టు రక్షణ: జుట్టుకు కొబ్బరి నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కొబ్బరి నూనెను జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే జుట్టును కడుక్కుంటే మంచి హెయిర్ కండీషనర్‌గా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

* స్ప్లిట్ హెయిర్ సమస్య: జుట్టు చివర్లు చీలిపోయి ఉంటే కొబ్బరినూనెను మూలాల నుంచి చివర్ల వరకు రాసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే కొద్ది రోజుల్లోనే ఈ సమస్య మాయమవుతుంది.

* పెయిన్ రిలీవర్: కొబ్బరినూనెలో రెండు చుక్కల పిప్పరమెంటు నూనె కలిపి కాళ్లు, చేతులకు మర్ధన చేసుకోవడం వల్ల కండరాల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

* బాడీ మసాజ్: లావెండర్ ఆయిల్‌ను కొబ్బరినూనెతో కలిపి శరీరమంతా మసాజ్ చేయడం వల్ల చేతులు, కాళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* లిప్ బామ్: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను పెదవులపై అప్లై చేయడం వల్ల పెదవుల పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

* మచ్చల నివారణ కోసం: కొబ్బరి నూనె చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి కొబ్బరి నూనెను స్నానానికి ముందు లేదా తర్వాత అప్లై చేయవచ్చు. మీ మెడ నుండి నూనెను రుద్దుతూ.. మోచేతులు, మోకాళ్లు, చేతులు, కాళ్లు వంటి పొడి ప్రాంతాల్లో నూనెను రాయండి. మీ మేకప్‌ను తొలగించడానికి కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. అలాగే చలికాలంలో లిప్ బామ్‌గా కూడా వాడొచ్చు.

*రాత్రిపూట చర్మానికి నూనె: ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను అరచేతిలో వేసుకుని ముఖం, మెడపై సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.. తర్వాత టిష్యూ పేపర్‌తో ముఖంపై ఉన్న నూనెను తుడిచేసుకోవాలి. రాత్రిపూట ఇలా చేస్తే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..