Punarnava Uses: తెల్ల గలిజేరు ఉపయోగాలు తెలిస్తే.. ఎక్కడ కనిపించినా వదిలిపెట్టరు..!

ఖాళీ ప్రదేశాలు, పల్లె ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగుతుంటాయి. వాటిల్లో తెల్లగలిజేరు కూడా ఒకటి . ఈ మొక్కలను చూసి మనందరం పిచ్చిమొక్కగానే అనుకుంటాం. కానీ నిజానికి ఈ మొక్కల్లో ఉన్న ఔషధగుణాల గురించి తెలిస్తే ఆ మొక్క ఎక్కడ ఉందా.? అని వెతుకుంటూ వెళ్లి మరి ఇంటికి తెచ్చుకుంటారు. గలిజేరు మొక్కని ఔషధాల గని అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఈ మొక్కను పునర్నవ అని పిలుస్తారు. మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్కను చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Jul 11, 2024 | 6:20 PM

ఈ గలిజేరులో రెండు రకాలు ఉన్నాయి. తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరు, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్థ రూపాయంత ఉంటాయి. ఔషధ గుణాలు రెండింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే..ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే 'పునర్నవ' అంటారు.

1 / 5
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్‌ సి,డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.  తెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి మరగించాలి. చల్లార్చి వడపోసిరోజు ఉదయం పరగడుపు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్ర నాళ సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి.  ఇలా 21 రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఫలితం ఉంటుందిన నిపుణులు చెబుతున్నారు.  అంతేకాదు.. ఇది తీసుకున్న తరువాత అరగంట ఏమీ తీసుకోకూడదు.

2 / 5
ఈ తెల్లగలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధగుణాలు నిండివుంది. ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలు నయం చేస్తుంది. లివర్‌ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని రకాల జ్వరాలను తగ్గించటంలో అద్భుతం చేస్తుంది.

3 / 5
ఈ తెల్లగలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి, వాతం నొప్పులున్న చోట, కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే సులువుగా ఆ నొప్పులన్నీ తగ్గుతాయి. శరీరాన్ని డిటాక్స్‌ఫై చేయటానికి అద్భుతం గా ఉపయోగపడుతుంది .

4 / 5
పునర్నవ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను నయం చేయడంలో ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మూత్ర నాళాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

5 / 5
Follow us