ఇండస్ట్రీలో కొన్ని జంటలను చూస్తుంటే ముచ్చటేస్తుంది.! జ్యోతిక బాటలో జెనీలియా.
కొంతమంది జంటలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. భార్యాభర్తలిద్దరూ లైమ్ లైట్‌లో ఉన్నా సరే, ఒకరి మీద ఒకరు చూపించుకునే గౌరవ మర్యాదలు ప్రేక్షకులను ఇట్టే మెప్పిస్తాయి. సౌత్‌లో ఇలాంటి అటెన్షన్ ఉన్న జంట సూర్య, జ్యోతిక. ఇద్దరూ నటులుగా, నిర్మాతలుగా బిజీ అయినప్పటికీ, కుటుంబ బాధ్యతలను కూడా కలిసి పంచుకుంటుంటారు. అలాగే నార్త్ లో మన వారి దృష్టిని ఆకర్షించే జంట జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్. మన హాసిని గురించి దేశ్‌ముఖ్ చెప్పే మాటలు వినడానికి చాలా ఇష్టపడతారు జనాలు.