నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమానే కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. ఆ సినిమా రెండు భాగాల్లోనూ నటించి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. కేజీఎఫ్ సినిమాల తర్వాత చియాన్ విక్రమ్ తో కోబ్రా మూవీలో మెరిసింది.