Tollywood: చిన్నప్పుడే స్కూల్లో స్పీచ్ అదరగొట్టిన అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

నటుడు కమల్ హాసన్ కూడా వేదికపై కూర్చుని అమ్మాయి ప్రసంగాన్ని వింటున్నాడు. ఎందుకంటే ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. కోట్లాది అభిమానులు ఉన్న ఆ తార.. తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లక్షలాది మంది ప్రేక్షకులు అభిమానించే తార. అలాగే భారతీయ సినిమాలోని ఓ స్టార్ హీరో కూతురు.

Tollywood: చిన్నప్పుడే స్కూల్లో స్పీచ్ అదరగొట్టిన అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
Heroine
Follow us

|

Updated on: Jul 11, 2024 | 5:46 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రోబ్యాక్ వీడియో తెగ వైరలవుతుంది. ఆ వీడియోలో కిక్కిరిసిన జనం ముందు ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆవేశపూరిత ప్రసంగం చేస్తూ కనిపించింది. గంభీరమైన గొంతు.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో స్పీచ్ అదరగొట్టేసిన ఆ అమ్మాయిని చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. నటుడు కమల్ హాసన్ కూడా వేదికపై కూర్చుని అమ్మాయి ప్రసంగాన్ని వింటున్నాడు. ఎందుకంటే ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. కోట్లాది అభిమానులు ఉన్న ఆ తార.. తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లక్షలాది మంది ప్రేక్షకులు అభిమానించే తార. అలాగే భారతీయ సినిమాలోని ఓ స్టార్ హీరో కూతురు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా..? తనే హీరోయిన్ శ్రుతిహాసన్.

లోకనాయకుడు కమల్ హాసన్, సారికల దంపతుల పెద్ద కూతురు శ్రుతి హాసన్. ఆరేళ్ల వయసులో ‘తేవర్ మకాన్’ సినిమాతో గాయనిగా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. కమల్ హాసన్ నటించిన ‘హే రామ్’ చిత్రంలో కూడా శృతి బాలతారగా నటించింది. చెన్నైలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, శృతి తన ఉన్నత చదువుల కోసం ముంబైకి వెళ్లింది. అక్కడే సెయింట్ ఆండ్రూస్ కళాశాల నుండి సైకాలజీ కంప్లీట్ చేసింది. యునైటెడ్ స్టేట్స్‌లో సంగీతాన్ని నేర్చుకుంది. ‘లక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.

ఇక తెలుగు, తమిళంలో అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమా ప్లాప్ కావడంతో ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ అవేం పట్టించుకోకుండా తన నటనతో నేడు ప్రశంసలు అందుకుంటుంది. చివరగా ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలో కనిపించింది. త్వరలోనే సలార్ 2 మూవీతో అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిన్న గ్యాప్ అంతే.. ఇప్పుడు తీరికలేనన్ని సినిమాలతో ప్రియాంక..
చిన్న గ్యాప్ అంతే.. ఇప్పుడు తీరికలేనన్ని సినిమాలతో ప్రియాంక..
ఇంటి రిన్నోవేషన్‌కు లోన్ కావాలా? ఇలా చేస్తే సులభంగా పొందొచ్చు..
ఇంటి రిన్నోవేషన్‌కు లోన్ కావాలా? ఇలా చేస్తే సులభంగా పొందొచ్చు..
మీ బైక్‌లో ఈ మాడిఫికేషన్స్ చేశారా.? జరిమానా చెల్లించక తప్పదు..
మీ బైక్‌లో ఈ మాడిఫికేషన్స్ చేశారా.? జరిమానా చెల్లించక తప్పదు..
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
మనిషివా.. డైనోసర్‌వా.. 100కిపైగా బ్రతుకున్న పాములను ఏం చేశాడంటే
మనిషివా.. డైనోసర్‌వా.. 100కిపైగా బ్రతుకున్న పాములను ఏం చేశాడంటే
మహిళలను మహరాణులుగా మార్చే సూత్రం ఇది.. పాటించి చూడండి..
మహిళలను మహరాణులుగా మార్చే సూత్రం ఇది.. పాటించి చూడండి..
బుడంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.. రుచి చూస్తే అసలు వ‌ద‌ల‌రు..!
బుడంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.. రుచి చూస్తే అసలు వ‌ద‌ల‌రు..!
నిన్న అయోధ్య, నేడు బద్రీనాథ్.. పుణ్యక్షేత్రాల్లో బీజేపీ పరాజయం..
నిన్న అయోధ్య, నేడు బద్రీనాథ్.. పుణ్యక్షేత్రాల్లో బీజేపీ పరాజయం..
వర్షాకాలంలో తల దురదతో ఇబ్బందిపడుతున్నారా.? ఇలా చెక్‌ పెట్టండి..
వర్షాకాలంలో తల దురదతో ఇబ్బందిపడుతున్నారా.? ఇలా చెక్‌ పెట్టండి..
పక్కా ఫ్లాన్ వేశాడు.. కానీ కథ అడ్డం తిరిగింది..!
పక్కా ఫ్లాన్ వేశాడు.. కానీ కథ అడ్డం తిరిగింది..!